'పరుగు 2'లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్.. తెలుగులో కాదట?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మరో మలుపు తిప్పిన చిత్రం పరుగు. దిల్ రాజ్ నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా 2008లో విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన పరుగు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే అప్పటివరకు బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆ సినిమా మరింత పెంచేసింది.
ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆ సినిమా ద్వారానే మరింత దగ్గరయ్యారు. ఇక అలాంటి సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు మూడేళ్ళ క్రితం ఒక టాక్ బాగానే వచ్చింది. కానీ ఆ రూమర్స్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఫైనల్ గా ఆ సినిమా కథకు సీక్వెల్ సిద్ధమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ తెలుగులో కాదు. బాలీవుడ్ లో సీక్వెల్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో బన్నీ ఒక అతిధి పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్. 2014లో పరుగు సినిమాను బాలీవుడ్ లో 'హీరో పంతి'గా రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ నటించిన ఆ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఇపుడు అదే కథకు మళ్ళీ కొనసాగింపుగా సీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. 2021లో హీరో పంతి 2 ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ సినిమాలో అల్లు అర్జున్ కథను మలుపు తిప్పే 5నిమిషాల పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరో టైగర్ ష్రాఫ్ నిర్మాత సాజిద్ నడియావాలా బన్నీతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బన్నీ కూడా అందుకు పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











