ఆ డైరెక్టర్ అంటే అల్లు అర్జున్‌కు భయమట.. అతడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఆ విషయం తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప మూవీతో స్టైలిష్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు ఈ స్టార్ హీరో. అయితే పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఉన్న ఓ డైరెక్టర్ అంటే మాత్రం భయమట. మరి బన్నీ భయపడే ఆ డైరెక్టర్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం పదండి.
అల్లు అర్జున్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. డాడీ సినిమాలో డ్యాన్సర్ గా ఓ చిన్న పాత్రలో మెరిసిన బన్నీ ఆ తర్వాత గంగోత్రి మూవీతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆర్య మూవీతో లవర్ బాయ్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్నీ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

ఆర్య నుంచి మొదలుకొని హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే బన్నీ ఇవన్నీ చేయడానికంటే ముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారట.
వేణు, శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెళ్ళాం ఊరెళితే సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తమిళంలో హిట్ అయిన చార్లీ చాప్లిన్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీకి ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒక నిర్మాత కాగా, ఆయన సూచనల మేరకే బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈ సినిమాకు పని చేశారట.
అయితే అప్పట్లో బన్నీకి ఎస్వీ కృష్ణారెడ్డి అంటే బాగా భయం ఉండేదట. ఓ సందర్భంలో జరిగిన ఇంటర్వ్యూలో ఎస్వి కృష్ణా రెడ్డి స్వయంగా అల్లు అర్జున్ గురించి ఈ విషయాన్ని బయట పెట్టారు. అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి టాప్ డైరెక్టర్ అన్న విషయం తెలుగు మూవీ లవర్స్ కి బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే భయపడుతూ ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట బన్నీ. కాగా అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఒకే ఒక్క మూవీ ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బన్నీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ హిందీ థియేట్రికల్ రైట్స్, ఓటిటి రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల రైట్స్ కు సైతం గట్టి పోటీ నెలకొందని టాక్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో మైత్రి మూవీ మేకర్స్ సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
కాగా ప్రస్తుతం పుష్ప : ది రూల్ మూవీ ఇంకా సెట్స్ పైనే ఉంది. ఈ మూవీని అనుకున్న సమయానికి తెరపైకి తీసుకురావడానికి మేకర్స్ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 మూవీ థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈసారి కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లో మాత్రమే కాకుండా జపాన్ లో కూడా అదే సమయానికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











