అల్లు అర్జున్‌కు కథ వినిపించిన గీత గోవిందం దర్శకుడు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత మరో సినిమా ప్రారంభించలేదు. నా పేరు సూర్య నిరాశపరచడంతో బన్నీ టైం తీసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ తో తదుపరి చిత్రం అంటూ జోరుగా ఉహాగానాలు సాగినా కథపై బన్నీ పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు.
తాజాగా అల్లు అర్జున్ కు ఇద్దరు టాలెంటెడ్ దర్శకులు కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న పరుశురాం అల్లు అర్జు కోసం ఓ కథ సిద్ధం చేసి వినిపించాడట. పరిసరం గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించిన రెండు చిత్రాలు శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం విజయాలుగా నిలిచాయి.

మరో వైపు వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతీ కూడా ఓ కథని బన్నీకి వినిపించాడట. ఈ ఇద్దరు దర్శకులకు తన నిర్ణయం ప్రకటించడానికి బన్నీ టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఓకె చెబుతాడనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











