twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Arjun: కేరళ స్టూడెంట్ కోసం ఐకాన్ స్టార్ సహాయం.. కలెక్టర్ కాల్ చేయడంతో గ్రీన్ సిగ్నల్!

    |

    పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపును అందుకున్న అల్లు అర్జున్ స్థాయి ఏ రేంజ్ కు పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనికి కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు వివిధ భాషల్లో కూడా అభిమానుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇక కేరళలో కూడా బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక కేరళలోని ఒక నిరుపేద అమ్మాయి కోసం అల్లు అర్జున్ సహాయం చేసిన విధానం అందరిని ఎంతగానో ఆలోచింపజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    మిస్టర్ పర్ఫెక్ట్

    మిస్టర్ పర్ఫెక్ట్

    కేవలం ఒక స్టార్ హీరో గానే కాకుండా అల్లు అర్జున్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే లక్షణాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యామిలీతో కూడా అతను ఎంతో అన్యోన్యంగా ఉంటాడు. ఎంత స్టార్ హోదా వచ్చినప్పటికీ కూడా వీలైనంతవరకు సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక ఎవరికైనా సహాయం కావాలి అంటే బన్నీ తన వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు.

    ఎంతోమందికి సపోర్ట్

    ఎంతోమందికి సపోర్ట్

    గతంలో అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో పేదల కోసం దానాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే తన దగ్గర వర్క్ చేసేవారు మరో మెట్టుకు ఎదగాలి అని బన్నీ ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇండస్ట్రీలో చాలామందికి అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడు. అందుకే అల్లు అర్జున్ అంటే సినిమా ప్రపంచంలో అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది.

    నిరుపేద అమ్మాయి కోసం

    నిరుపేద అమ్మాయి కోసం

    అయితే అల్లు అర్జున్ ఇటీవల కేరళలోగా నిరుపేద అమ్మాయికి సహాయం చేసిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. 92 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైన ఒక నిరుపేద అమ్మాయి ఉన్నత చదువుల కోసం ఎంతగానో ఇబ్బంది పడింది. అయితే ఆమె గురించి తెలుసుకున్న అలిప్పి కలెక్టర్ కృష్ణ తేజ అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకువెళ్లాడు.

    అల్లు అర్జున్ సపోర్ట్

    అల్లు అర్జున్ సపోర్ట్

    అమ్మాయి తండ్రి కూడా గత ఏడాది కరోనా కారణంగా మరణించాడు. దీంతో అప్పటినుంచి ఆ యువతి చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్తోమత వలన చదువుకోకపోవడంతో ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక అల్లు అర్జున్ ని సంప్రదించగానే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

    ఫీజుతో పాటు..

    ఫీజుతో పాటు..

    వియర్ ఫర్ అలెప్పి అనే స్లోగన్ తో కలెక్టర్ కృష్ణ తేజ మొదలుపెట్టిన ఈ మూమెంట్ ఎంతోమంది నిరుపేదలకు ఉపయోగపడుతుంది. ఇక అల్లు అర్జున్ కూడా స్టూడెంట్ కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కాలేజీ ట్యూషన్ ఫీజుతోపాటు ఆమె నాలుగేళ్ల పాటు హాస్టల్లో ఉండేందుకు ఖర్చులు కూడా భరిస్తాను అని మాట ఇచ్చినట్లుగా కలెక్టర్ తెలియజేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇక సాయం పొందిన అమ్మాయి ప్రైవసీ కారణంగా ఆ వివరాలు ఏమీ చెప్పలేదు.

    English summary
    Allu arjun helps for kerala nursing student higher education
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X