రంగుల్లో తడిసి ముద్దైన అల్లు అర్జున్.. నిహారిక, ఫ్యామిలీతో జోష్‌గా హోళీ!
ఏదైనా సందర్భం దొరికితే ఫుల్‌గా ఎంజాయ్ చేసే హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ వ్యాల్యూస్‌కు ఎక్కువగా ఇంపార్టెంటెన్స్ ఇచ్చే హీరో ఆయన ఒకరని చెప్పుకొంటారు. లవర్స్ డే గానీ, బర్త్ డేగానీ, ఫ్యామిలీ ఫంక్షన్ గానీ అల్లు అర్జున్ ముందుంటారు. తాను ఎంజాయ్ చేసిన క్షణాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకొంటారు. మార్చి 21 హోళీ సందర్భంగా స్టైలిష్ స్టార్ చేసిన హంగామా మీరే చూడండి..

కూతురుతో కలిసి సైలిష్ స్టార్
అల్లు అర్జున్ తన ముద్దుల కూతురితో కలిసి హోళీని ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకకు తన ఫ్యామిలీ సభ్యులతో జత కలిశారు. జోష్‌గా రంగులు వెదజల్లుతూ స్టైలిష్ హంగామా చేశారు.

భార్యను రంగుల్లో ముంచెత్తిన అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని రంగుల్లో ముంచెత్తుతున్న దృశ్యం. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా పాలు పంచుకొన్నారు.

కూతురితో కలిసి మధుర క్షణాలు
హోళీ పండుగ సందర్భంగా తన మధుర క్షణాలను కూతురుతో గడుపుతున్న దృశ్యం. కలర్లతో కూడిన బాణాసంచాను కూతురితో కలిసి పేల్చుతూ ఆనందంగా సంబరాలు జరుపుకొన్నారు.

మెగా డాటర్ నిహారికతో అల్లు అర్జున్
మెగా డాటర్ నిహారికను రంగుల్లో ముంచెత్తున్న అల్లు అర్జున్. పక్కనే ఉన్న స్టైలిష్ స్టార్ భార్య స్నేహారెడ్డి.


Click it and Unblock the Notifications











