వాళ్లిద్దరి తర్వాత స్టైలిష్ స్టారే.. త్రివిక్రమ్ సినిమాకు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ అంతా.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ మధ్య భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో.. గత చిత్రం 'నా పేరు సూర్య'తో ఫ్లాప్‌ను దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వేగంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

త్రివిక్రమ్ మార్క్ కంటెంట్‌తో వస్తోంది
రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘అల.. వైకుంఠపురములో' విషయంలో యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అదిరిపోయే ఫ్యామిలీ డ్రామాను రాశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డైలాగులు ప్రధానాకర్షణ కానున్నాయని టాక్. అలాగే, స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.

అన్నింటికీ అనూహ్య స్పందన
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో' నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటలు, టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘సామజవరగమన', ‘రాములో రాములా' పాటలు అయితే యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పాటలు అత్యధిక స్థాయిలో వ్యూస్ సాధించడంతో పాటు లైకులను కూడా సంపాదించగలిగాయి.

మరో భాషలోనూ రిలీజ్
ఎంతో ప్రతిష్టాత్మక వస్తున్న ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ‘అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్‌తో మలయాళంలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. అక్కడ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ బాధ్యతలను ఆర్‌డీ ఇల్యుమినేషన్ సంస్థ తీసుకుందని సమాచారం.

బన్నీ రెమ్యూనరేషన్ రికార్డ్
ఈ సినిమాకు గానూ బన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ‘అల.. వైకుంఠపురములో'కు అల్లు అర్జున్ రూ. 25 కోట్లు తీసుకున్నాడట. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ప్రభాస్, మహేశ్ మాత్రమే ఈ మార్కును దాటినట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీళ్ల తర్వాత బన్నీ ఇప్పుడు ఇంత మొత్తం చార్జ్ చేశాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
Recommended Video

‘అల.. వైకుంఠపురములో' విషయానికొస్తే..
‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











