Allu Arjun: భార్యతో బన్నీ రొమాంటిక్ ఫోటో.. అలా కనిపించడంతో ట్రెండింగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ అందుకున్నప్పటికీ కూడా ఫ్యామిలీ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తాడు అని చెప్పవచ్చు. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన భార్యా పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక తన భార్యతో ఉన్న ఒక రొమాంటిక్ ఫొటో ప్రస్తుతం నేషనల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో కూడా ఫోటో ట్రెండింగ్ లిస్ట్ లోకి వెళ్లింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ మళ్లీ సెకండ్ పార్ట్ తో అంతకుమించి అనేలా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఇక త్వరలోనే ఆ పనులు కూడా మొదలు కానున్నాయి. అయితే ఈ తరుణంలో బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి వీలైనంత ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

పుష్ప సినిమా ప్రభావంతో బన్నీ మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా నేషనల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. బన్నీ తన భార్య స్నేహారెడ్డితో ఉన్న ఒక రొమాంటిక్ ఫోటో కూడా జాతీయ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. ఐదేళ్ల క్రితం దిగిన ఫోటోలో అల్లుఅర్జున్ తన భార్యను కౌగిలించుకుని చాలా ప్రేమగా కనిపించడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. అప్పుడు స్నేహ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ చేసుకున్న అల్లు అర్జున్ ఆ విధంగా కెమెరాకు స్టిల్ ఇచ్చాడు.
అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన పుట్టినరోజు వేడుకలు వస్తే మాత్రం సినిమా షూటింగ్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. వారి పుట్టినరోజు పార్టీ ని కూడా తనదైన శైలిలో గ్రాండ్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా కూతురు అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అనే చెప్పాలి. ఎక్కువగా తన కొడుకు కూతురుతోనే ఒక చిన్న పిల్లాడి తరహాలో బన్నీ ఆడుకుంటూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను కూడా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











