చివరికి ఆ హీరో వద్దకు చేరుతున్న అల్లు అర్జున్ ఐకాన్ కధ.. స్టార్ట్ ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందుగా దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేసి అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అయితే ఐకాన్ మూవీ స్టార్ట్చేద్దామనుకునే సమయంలో అల్లు అర్జున్ ఇంకో సినిమాతో బిజీగా ఉన్నారు.
దీంతో దానిని పక్కన పెట్టి దిల్ రాజు, వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. వేణు శ్రీరామ్ కి కూడా మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. అయితే వకీల్ సాబ్ తర్వాత నెక్స్ట్ మూవీ కోసం ఈ డైరెక్టర్ చాలా టైమ్ తీసుకున్నారు. అల్లు అర్జున్ తో చేద్దామనుకున్న అతను అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో కథలో మళ్ళీ మార్పులు చేసుకొని చాలా మంది హీరోలని ట్రై చేసినట్లు తెలుస్తోంది.

ఫైనల్ గా ఐకాన్ మూవీకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లోనే నితిన్ హీరోగా ఈ మూవీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. దీని తర్వాత వెంకి కుడుమలతో మరో సినిమా ఉంది. ఈ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తారు. దాంతో పాటుగానే ఐకాన్ సినిమాని కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఐకాన్ మూవీకి సంబందించిన క్యాస్టింగ్ పై వేణు శ్రీరామ్ దృష్టి పెడుతున్నారు. అక్క తమ్ముళ్ళ అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందంట. నితిన్ కెరియర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. నితిన్ చివరిగా మాచర్ల నియోజకవర్గం మూవీలో నటించారు. ఈ సినిమా ఆయన ఖాతాలో మరో డిజాస్టర్ గా మారింది. అయితే ప్రస్తుతం వక్కంతం వంశీతో చేయబోయే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ మూవీలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది.


Click it and Unblock the Notifications











