twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Balakrishna తండ్రి లాంటి వారు.. ఎన్టీఆర్ తరువాత ఆయనకే సాధ్యం.. జై బాలయ్య అన్న అల్లు అర్జున్!

    |

    న‌ట‌సింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ మీద మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

    బాలయ్య తండ్రి లాంటి వారు

    బాలయ్య తండ్రి లాంటి వారు

    అల్లు అర్జున్ మాట్లాడుతూ 'నందమూరి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ అభినందనలనీ అన్నారు. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉందన్న ఆయన నందమూరి, అల్లు ఫ్యామిలీకు ఉన్న బంధం ఇప్పటిది కాదనీ ఈ నాటి ఈ బంధం ఏనాటిదో అని చెప్పుకొచ్చారు. మా తాత గారు నేరుగా ఎన్టీఆర్ వంటింటికి వెళ్లేవారన్న ఆయన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగామని అలాంటి వారి సినిమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందనీ అన్నారు. బాలయ్య నాకు తండ్రిలాంటి వారన్న బన్నీ బోయపాటి గారి సినిమా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందనీ అన్నారు.

    అప్పుడే నమ్మకం ఉంది

    అప్పుడే నమ్మకం ఉంది


    బోయపాటితో నేను భద్ర సినిమా చేయాలి.. కానీ అప్పుడు ఆర్య సినిమా కోసం వెళ్లాను.. అప్పుడే బోయపాటి గారు పెద్ద దర్శకుడు అవుతారని నాకు నమ్మకం ఉందని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్.. అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ఎదిగారన్న బన్నీ, మీ జర్నీ చూశాను.. మనతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉందనీ అన్నారు. నేను పైకి వెళ్తుంటే కూడా బోయపాటి గారు ఆనందిస్తుంటారు. మంచి సినిమా కాదు.. మెట్టు ఎక్కే సినిమా చేయాలి అనేవారనీ గుర్తు చేసుకున్నారు. అలానే నాతో సరైనోడు అనే సినిమాను తీశారని అన్నారు. ఇక బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా గురించి నేను చెప్పాల్సిన పని లేదన్న బన్నీ ట్రైలర్ చూశాను, అది పూనకాలు వచ్చేలా ఉందనీ అన్నారు.

    తమన్ ముట్టుకుందల్లా బంగారం..

    తమన్ ముట్టుకుందల్లా బంగారం..

    తాండవంలా ఉందని తమన్ అన్నాడు, అసలు తమన్ మామూలు ఫాంలో లేడు.. ముట్టుకుందల్లా బంగారం.. కొట్టిందల్లా సిక్సర్ అవుతోంది అని బన్నీ చెప్పుకొచ్చారు. అలాగే ఈ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండమైన హిట్ సాధించాలి. ఓ సినిమాను ఇన్ని రోజులు ఆపారంటే.. అది ఎంత కష్టమో నాకు తెలుసన్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ గురించి నాకు బాగా తెలుసని ఆమె ఎంతో మంచి నటి. ఆమెకు ఈ సినిమా బూస్ట్ ఇస్తుందన్నారు. శ్రీకాంత్ అన్నయ్య మనసు ఎంతో మెత్తనైందన్న బన్నీ ఈయన ఒక విలన్ కారెక్టర్ ఎలా వేయగలరు అని అనుకున్నాను కానీ బోయపాటి గారు లెక్కలు అన్నీ మార్చేశారనీ అన్నారు.. ఇకపై కొత్త శ్రీకాంత్‌ను చూడాలని కోరుకుంటున్నానని బన్నీ అన్నారు.
    ..

    ఎన్టీఆర్ తరువాత బాలయ్యే

    ఎన్టీఆర్ తరువాత బాలయ్యే


    ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ బాలకృష్ణ గారికి ఈ లెవెల్‌లో ఉండటానికి రెండు కారణాలు. ఒకటి.. ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్. రెండోది ఆయన వాచకం.. ఆయనలా డైలాగ్ చెప్పేవారు ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చారు. రెండు మూడు పెజీల డైలాగ్స్ చెప్పినా అదే ఇంటెన్సిటీ ఉంటుందనీ, ఈ డిక్షన్ అనేది మహానుభావులు ఎన్టీఆర్ గారి వల్లే కుదిరింది. ఆ తరువాత కేవలం బాలయ్య గారే చెప్పగలరన్నారు. రీల్‌లో అయినా రియల్‌లో అయినా.. ఆయన రియల్‌గానే ఉంటారు. కోపం వస్తే కోపం.. ప్రేమ వస్తే ప్రేమ.. ఎప్పుడూ రియల్‌గానే ఉంటారని అన్నారు. మనం అనుకున్నది చేయగలగడం, అనుకున్నట్టు ఉండటం చాలా కష్టం, కానీ బాలయ్య గారు అలా ఉంటారు. నాకు పర్సనల్‌గా ఆయనలో ఇష్టమైంది అదేనని అన్నారు.

    నాకు పర్సనల్ గా ఇష్టం

    నాకు పర్సనల్ గా ఇష్టం


    మనిషి మనసులో ఏం పెట్టుకోకుండా ఇలా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడో అని అనుకునే వాడిని.. అందుకే ఆయనకు ఇంత ఫ్యాన్ బేస్ వచ్చిందేమో అని అనుకున్నాననీ అల్లు అర్జున్ పేర్కొన్నారు. నాకు చాలా పర్సనల్‌గా నచ్చిన విషయం అదేనని అన్నారు. అఖండమైన విజయాన్ని సాధించాలి.. చిన్న సినిమాల మీద చాలా మందికి సింపతి ఉంటుంది. వారికి ఓటీటీలున్నాయి. కానీ పెద్ద సినిమాలకు వచ్చిన కష్టం మామూలు విషయం కాదనీ ఎందుకంటే ప్రస్తుతం అంతా కూడా సినిమా గెలవాలని అంటున్నారు. సెకండ్ వేవ్ తరువాత విడుదలవుతున్న పెద్ద సినిమా ఇదనీ ఆయన అన్నారు.

    Recommended Video

    Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu
    జై బాలయ్య

    జై బాలయ్య


    అఖండ సినిమా అఖండ జ్యోతిలా తెలుగు సినిమాకు వెలుగునివ్వాలని అందరం కోరుకుటున్నామన్న బన్నీ ఈ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ.. మరో రెండు వారాల్లో రాబోతోన్న పుష్ప ఆ తరువాత రాబోతోన్న ఆర్ఆర్ఆర్..అలా ముందుకు వెళ్లాలి..ఇండస్ట్రీ గెలవాలని ఆకాంక్షించారు. నన్ను ఇలా పిలిచినందుకు అందరికీ థ్యాంక్స్ అని పేర్కొన్న ఆయన తెలుగు ప్రేక్షకులు సినిమాలను ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరన్నారు. ఇక కోవిడ్ వచ్చినా.. పైనుంచి దేవుడు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు.. సినిమా తగ్గేదేలే.. మీ అందరి కోసం జై బాలయ్య ' అంటూ ఉత్సాహ పరిచారు.

    English summary
    Allu Arjun interesting speech at akhanda pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X