నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి సమయంలో తన జీవితంలోకి ప్రవేశించిన స్నేహారెడ్డితో ప్రేమలో మునిగిపోయారు. ఇరు కుటుంబాలను ఒప్పించి జీవిత భాగస్వామిని చేసుకొన్నారు. అయితే గుట్టుచప్పుడుగా సాగిన ప్రేమ వ్యవహారానికి సంబంధించి సమంతతో పంచుకొన్న విషయాలు మీకోసం..

సీక్రెట్‌గా అల్లు అర్జున్ లవ్ అఫైర్
స్నేహారెడ్డితో కొనసాగిస్తున్న అఫైర్ గురించి అల్లు అర్జున్ అత్యంత సీక్రెట్‌గా ఉంచారంట.. ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకొన్నారట. అయితే తన ప్రేయసి గురించి, ప్రేమ గురించి కేవలం ఇద్దరికి మాత్రమే అన్ని విషయాలు షేర్ చేసుకొన్నారని సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

నా గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం
అల్లు అర్జున్ ఓ రోజు వచ్చి నాకు స్నేహరెడ్డిని పరిచయం చేశాడు. నా గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం చేయడంతో నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నాకే పరిచయం చేయడంతో చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ తర్వాత నాకే ఎందుకు ఆమెను పరిచయం చేశాడనే ఆలోచనలో మునిగిపోయాను అని సమంత పేర్కొన్నారు.

స్నేహారెడ్డితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్
స్నేహారెడ్డిని చూసిన మొదటిసారే ఆమెతో ప్రేమలో పడ్డారు. వారిద్దరిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆమెలో రెండు క్వాలిటీస్ చూసి ముచ్చటపడ్డారు. ఆమెలో ఉండే హుందాతనం ఆయనకు నచ్చింది. నైట్ క్లబ్‌లో కూడా చాలా డీసెంట్‌గా దుస్తులు ధరించడం చూసి అల్లు అర్జున్ ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా యాటిట్యూడ్ పరంగా చాలా బ్యాలెన్స్‌గా ఉంటారు అని సమంత చెప్పారు.
Recommended Video

అల్లు అర్జున్ కెరీర్ గురించి
ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌కు ముందు అల వైకుంఠపురంలో మూవీతో కెరీర్‌లోనే ది బెస్ట్, బ్లాక్‌బస్టర్‌ను అల్లు అర్జున్ అందుకొన్నారు. ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో మరో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











