twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ఊహించని రికార్డు: ఇండియాలోనే ఏకైక హీరోగా ఘనత.. క్రికెటర్లతో పోటీ పడుతూ అలా!

    |

    ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. టాలెంట్ లేకపోతే ఏ రంగంలోనైనా ఎవరూ నెగ్గుకు రాలేరు. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో వారసుల విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. నైపుణ్యం ఉన్న వాళ్లను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. ఇలా.. బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో అల్లు అర్జున్ ఒకడు. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడతను. ఈ క్రమంలోనే తాజాగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేమిటంటే...

    గ్యాప్ వచ్చినా.. సరైన హిట్ కొట్టిన స్టార్

    గ్యాప్ వచ్చినా.. సరైన హిట్ కొట్టిన స్టార్

    'నా పేరు సూర్య' తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న అల్లు అర్జున్.. గత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ భారీ మూవీ అద్భుతమైన స్పందనతో హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలూ పలు రికార్డులు సాధించాయి.

    మూడోసారి జోడీ... ఈ సారి భారీ లెవెల్‌

    మూడోసారి జోడీ... ఈ సారి భారీ లెవెల్‌

    ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

     స్టైలిష్ ఐకాన్... అందులో స్పెషలిస్టుగా

    స్టైలిష్ ఐకాన్... అందులో స్పెషలిస్టుగా

    సినిమా సినిమాకూ స్టైల్స్‌లో వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు అల్లు అర్జున్. అందుకే అతడిని స్టైలిష్ స్టార్ అని సంబోధిస్తుంటారు. యాక్టింగ్‌తో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేయగల అతడు.. ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన మూమెంట్లతో ఆకట్టుకున్నాడు. తద్వారా ఇండియాలోనే ఫైనెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా నిలిచాడు. ఇదే ఈ మెగా హీరోకు దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు.

     బన్నీ సినిమాలకు క్రేజ్.. గత ఏడాది అల

    బన్నీ సినిమాలకు క్రేజ్.. గత ఏడాది అల

    బన్నీ నటించే ప్రతి సినిమా హిందీలో డబ్బింగ్ అవుతుందన్న విషయం తెలిసిందే. అతడి చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అందుకే అతడి పేరిట ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అదే సమయంలో గత ఏడాది 'అల.. వైకుంఠపురములో'లోని పాటలు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. దీంతో అల్లు అర్జున్ నేషనల్ ఫిగర్‌గా మారిపోయాడు.

    అల్లు అర్జున్ ఖాతాలో ఊహించని రికార్డ్

    అల్లు అర్జున్ ఖాతాలో ఊహించని రికార్డ్

    తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటి.. 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోతున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే పలు రకాలుగా దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న అతడు.. తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. GQ ఇండియా సంస్థ తాజాగా విడుదల చేసిన 25 మంది మోస్ట్ ఇన్‌ప్లూయెన్స్ యంగ్‌ ఇండియన్స్ జాబితాలో బన్నీ చోటు దక్కించుకున్నాడు.

     ఇండియాలోనే ఏకైక హీరోగా బన్నీ ఘనత

    ఇండియాలోనే ఏకైక హీరోగా బన్నీ ఘనత

    2020వ సంవత్సరానికి సంబంధించి GQ ఇండియా సంస్థ విడుదల చేసిన జాబితాలో క్రికెటర్లు, సినిమా యాక్టర్లతో పాటు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్లకు చోటు దక్కింది. ఈ జాబితాలో అనుష్క శర్మ మొదటి స్థానంలో నిలివగా.. క్రికెటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సినిమా హీరోల విభాగంలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఈ లిస్టులో ఉండడం విశేషం.

    English summary
    Last year, the coronavirus upended life as we knew it. But despite the profound disruption, a new breed of tastemakers not only survived, but thrived. The individuals on this list are innovators and disruptors. They look beyond the ordinary and dare to do things differently – be it the founder of a $10 billion ed-tech unicorn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X