Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Pushpa రెండో పార్ట్ కోసం బన్నీ సంచలన నిర్ణయం: ఆ తప్పును మళ్లీ చేయకూడదనే ఇలా!
బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితం 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న ఈ స్టైలిష్ హీరో.. గత ఏడాది చివర్లో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. అదే సమయంలో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పోటెత్తడంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ రెండో భాగం కోసం బన్నీ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఆ పూర్తి వివరాలు మీకోసం!
పుష్పగా అల్లు అర్జున్ అరాచకం
'ఆర్య', 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.
హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!
అన్ని భాషల్లోనూ పుష్ప సక్సెస్
క్రేజీ కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది.
భారీ లాభాలు అందుకున్నాడు
గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా దక్కాయి.
బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ
రూల్ చేయడానికి బన్నీ రెడీగా
'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రూపొందనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని కూడా సినిమాలోనే తెలిపారు. ఇందులో పుష్ప రూలర్‌గా మారడాన్ని చూపిస్తారు.
షూట్ స్టార్ట్ కాకున్నా ఆఫర్లతో
'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!
ఐకాన్ స్టార్ సంచలన నిర్ణయం
మొదటి భాగం అనుకున్న దానికంటే భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో 'పుష్ప ద రూల్'పై అంచనాలు మరింతగా నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే చిత్ర యూనిట్ ఈ సారి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం దేన్నైనా (కొత్త ప్రాజెక్టులు, యాడ్స్ వంటివి) వదలుకోవాలని అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నాడట.
ఆ తప్పును మళ్లీ చేయకుండా
వాస్తవానికి 'పుష్ప' మొదటి భాగాన్ని హడావిడిగా పెద్దగా ప్రమోషన్లు లేకుండానే విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు మిగిలిన భాషల్లో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడా తప్పును చేయకూడదని బన్నీ డిసైడ్ అయ్యాడట. ఇందులో భాగంగానే అన్నీ ప్లాన్ ప్రకారమే చేసి సినిమాను మరింత చేరువ చేయాలని భావిస్తున్నాడట.