రెండు ప్రభుత్వాలపై అల్లు అర్జున్ పోరాటం.. మామయ్యల స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ.!

By Manoj Kumar P

మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా... యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు అల్లు అర్జున్. సినిమా సినిమాకూ కొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ స్టైలిష్ స్టార్ అనే బిరుదు దక్కించుకున్నాడు. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అతడు... ఈ మధ్య భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతడు పాన్ ఇండియా మూవీలతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పొలిటికల్ కెరీర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

ఇండస్ట్రీ హిట్‌తో ఫామ్‌లోకి అల్లు అర్జున్

ఇండస్ట్రీ హిట్‌తో ఫామ్‌లోకి అల్లు అర్జున్

‘నా పేరు సూర్య' తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆలస్యమైనప్పటికీ... ‘అల.. వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ చిత్రంతో సత్తా చాటాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా... భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో బన్నీ ఫామ్‌లోకి వచ్చేశాడు.

పుష్ప కోసం ఆ స్మగ్లర్‌గా మారిన బన్నీ

పుష్ప కోసం ఆ స్మగ్లర్‌గా మారిన బన్నీ

‘అల.. వైకుంఠపురములో' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు బన్నీ. ఈ ఉత్సాహంతోనే సుకుమార్‌తో సినిమాను ప్రకటించాడు. ‘పుష్ప' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్.

పుష్పకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు

పుష్పకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు

ఐదు భాషల్లో తెరకెక్కనున్న ‘పుష్ప'లో అల్లు అర్జున్ మేకోవర్ డిఫరెంట్‌గా ఉంది. ఈ విషయం ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లతో సుస్పష్టమైంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ నుంచి విజయ్ సేతుపతి వెళ్లిపోయాడు. అంతేకాదు, కరోనా కారణంగా దీని షూటింగ్ చాలా రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది.

ఊహించని ప్రకటన చేసిన స్టైలిష్ స్టార్

ఊహించని ప్రకటన చేసిన స్టైలిష్ స్టార్

‘పుష్ప' షూటింగ్ వాయిదా పడడంతో అల్లు వారి హీరో ఖాళీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఊహించని ప్రకటన చేశాడు. అదే.. బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా. అవును... ఎంతో కాలంగా బన్నీ వేచి చూస్తున్న కాంబినేషన్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో వస్తుంది.

ఇద్దరూ బిజీ... అప్పటి నుంచే ప్రారంభం

ఇద్దరూ బిజీ... అప్పటి నుంచే ప్రారంభం

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. అదే సమయంలో బన్నీ కూడా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప' చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన వెంటనే వీళ్లిద్దరి కాంబో పట్టాలెక్కనుంది. అంటే 2021 ద్వితియార్థంలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక, 2022లో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

రెండు ప్రభుత్వాలపై అల్లు అర్జున్ పోరాటం

రెండు ప్రభుత్వాలపై అల్లు అర్జున్ పోరాటం

ఓటమి ఎరుగని దర్శకుడు... స్టార్ హీరో కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికితోడు... ప్రకటన సమయంలో వదిలిన పోస్టర్‌తో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ కథ ఇదేనంటూ ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... ఇందులో బన్నీ రెండు ప్రభుత్వాలపై పోరాటం చేస్తాడట.

Recommended Video

Celebrities Green India Challenge
మామయ్యల స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ.!

మామయ్యల స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ.!

ప్రస్తుతం వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం... ఈ మూవీ గ్యాస్ లీకేజ్‌తో ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని అంటున్నారు. అదే సమయంలో ఫ్యాక్టరీల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని... దాన్ని నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేసే యువకుడిగా బన్నీ కనిపిస్తాడట. ఈ క్రమంలోనే అతడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X