అల్లు అర్జున్ అస్సలు తగ్గట్లేదు.. న్యూ లుక్ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్
అసలైతే అల్లు అర్జున్ మరో ఎడాది వరకు వేరే దర్శకులకు మాట ఇవ్వకూడదని అనుకున్నాడు. ఎందుకంటే పుష్పతో పాటు మరో రెండు నిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం అయితే పూర్తిగా తన దృష్టిని పుష్ప సినిమాపైనే పెట్టనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప కోసం అభిమానుకు ఏ స్థాయిలో నమ్మకాన్ని పెంచుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అల్లు అర్జున్ పుష్ప కోసం నెవర్ బిఫోర్ అనేలా కష్టపడుతున్నాడు. గత రెండు నెలల్లో రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ సినిమా కోసం ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది.
పాన్ ఇండియా సినిమా కాబట్టి పూర్తిగా ఆ సినిమాపైనే దృష్టి పెట్టాడు. ఇక ఆ తరువాత బన్నీ లిస్టులో కొరటాల శివ అలాగే వేణు శ్రీరామ్ ఉన్నారు.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోయే ఐకాన్ లో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడట. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో కూడా నెవర్ బిఫోర్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అల్ట్రా స్టైలిష్ లుక్కుతో కనిపిస్తాడని టాక్. పుష్ప లాంటి ఊర మాస్ అనంతరం చేయబోయే సినిమాలో వీలైనంత వరకు కొత్తగా కనిపించాలని ఆలోచిస్తున్నాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో స్టార్ట్ చేయవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











