AA22 A6: అట్లీతో ప్రాజెక్ట్ అల్లు అర్జున్ బిగ్ లీక్.. ఐకాన్ స్టార్ కాకుండా అదే హైలెట్!

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు హీరోలు తీసుకొస్తున్న సినిమాలు చూస్తుంటే ఒకొక్కరికీ మతి పోతున్నాయి. లార్జర్ థన్ లైఫ్ సినిమాలు అలాగే హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్ ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర నుంచి స్టాండర్డ్స్ పెంచే విధంగా వస్తున్నాయి.

కాగా ఇలా ఇండియన్ సినిమా నుంచి రీసెంట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ అయ్యిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చిత్రం కోసమే చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడే అందులో విజువల్స్ చూసి హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా అర్ధం అవుతుంది. అయితే అసలు తాము ఏం చేస్తున్నాం అనేది అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఒక బిగ్ లీక్ ని అందించడం వైరల్ గా మారింది.

Allu Arjun leaks AA22 A6

అట్లీ తన దగ్గరకి అసలు ఈ సినిమా ఐడియా చెప్పడం తోనే ఓకే చేసేసినట్టుగా సెలవిచ్చాడు. అంతే కాకుండా ఈ చిత్రంలో అత్యధికంగా కీలక పాత్ర పోషించేది విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే అని అసలు విషయాన్ని బన్నీ లీక్ చేసాడు. అంటే ఈ సినిమాతో ఆడియెన్స్ ని ఖచ్చితంగా మరో లోకం లోకి తీసుకెళ్లడమే ఇద్దరూ ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు. వీటితో పాటుగా బన్నీ మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.

విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ ఆడియెన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని తాము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిపాడు. దీనితో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సినిమా మేజర్ గా VFX మీద మాత్రమే ఆధారపడి తెరకెక్కించే సినిమా అని చెప్పవచ్చు. మరి ఇంతలా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా హైప్ చేస్తున్న ఈ చిత్రం ఆడియెన్స్ ఏ రేంజ్ ట్రీట్ ఇస్తుందో చూడాలి మరి. అట్లీ కూడా ఈ సినిమాని తనకి డ్రీం ప్రాజెక్ట్ అని ఆ మధ్య రివీల్ చేసాడు.

సో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా విజువల్ ఎఫెక్ట్ స్టాండర్డ్స్ ని మారుస్తుందో లేక ఇది వరకు ఈ సినిమా లానే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఉన్న సినిమా మాది అంటూ చెప్పి విడుదలకి వచ్చి నాసిరకమైన విజువల్స్ ని అందించిన సినిమాగా మిగిలిపోతుందో అనేది చూడాలి చూడాలి.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాకి హీరోయిన్ ఎవరు అనే హంట్ కొనసాగుతుండగా ఈ అంశాలతో పాటుగా ఈ ఏడాదిలోనే ఈ చిత్రం షూటింగ్ ని మేకర్స్ స్టార్ట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్ గానే పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే రేంజ్ లో జవాన్ సినిమాతో బాలీవుడ్ కి మొదటి 1000 కోట్లు సినిమా ఇచ్చిన దర్శకుడు అట్లీతో చేస్తుండడం తమ సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. గట్టిగా ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరూ ఏ రేంజ్ వసూళ్లు అందిస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: allu arjun aa22 atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X