ఇంట్రెస్టింగ్: పర్‌ఫెక్షన్ కోసం అల్లు అర్జున్ సాహసం.. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రిస్కీ ఫీట్లు.!
గతంలో పోలిస్తే ఇప్పుడు సినిమా టేకింగ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. మొదటి, రెండో తరం హీరోలు సినిమా కోసం అంతగా సాహసం చేసేవారు కాదు అన్న టాక్ ఉంది. అయితే, ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. నేటి తరం హీరోలు చాలా మంది సినిమాల కోసం సాహసాలు చేస్తున్నారు. దీంతో చాలా వరకు సక్సెస్ అవగలుగుతున్నారు. ఇప్పుడిదే జాబితాలోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి చేరాడు. పర్‌ఫెక్షన్ కోసం అతడు ప్రాణాలను సైతం పణంగా పెట్టాడని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ దేని కోసం అలా చేస్తున్నాడు.? వివరాల్లోకి వెళితే...

అల్లు అర్జున్ అల.. ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు
‘నా పేరు సూర్య' తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆలస్యం అయినా ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరచలేదు. దీనికి కారణం త్రివిక్రమ్‌తో చేసిన ‘అల.. వైకుంఠపురములో' మూవీనే. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను తిరగరాయడంతో పాటు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

లెక్కల మాస్టారుతో కలిసిన స్టైలిష్ స్టార్
‘అల.. వైకుంఠపురములో' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ క్రమంలోనే అతడు లెక్కల మాస్టారు సుకుమార్‌తో మరోసారి జత కట్టాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తోంది.

మరోసారి మెస్మరైజ్ చేయబోతున్న సుక్కూ
రామ్ చరణ్‌తో చేసిన ‘రంగస్థలం' సూపర్ హిట్ అయినప్పటికీ.. సుకుమార్ చాలా కాలం మరో సినిమాను చేయలేదు. ఆలస్యం అయినప్పటికీ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశాడని ప్రచారం జరుగుతోంది. ఫుల్ మాస్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

గతంలో చూడని విధంగా బన్నీ.. అందుకే ఇలా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గెటప్ అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. ఇందుకోసం ఫుల్ మాస్ రోల్ ప్లాన్ చేశాడట సుకుమార్. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం అతడు గుబురు గెడ్డం.. వత్తైన జుట్టుతో దర్శనమివ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

పర్‌ఫెక్షన్ కోసం అల్లు అర్జున్ సాహసం
ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం... సినిమాలో తన పాత్ర పర్‌ఫెక్ట్‌గా ఉండాలని భావిస్తున్న బన్నీ... అందుకోసం లారీ డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడట. అది కూడా ఘాట్ రోడ్‌లు ఉండే దట్టమైన అటవీ ప్రదేశంలో అని సమాచారం.
Recommended Video


ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రిస్కీ ఫీట్లు.!
‘అల.. వైకుంఠపురములో' తర్వాత బన్నీ.. ‘రంగస్థలం' తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని నిలబెట్టుకునేందుకు సూపర్ స్క్రిప్ట్ రెడీ చేశారని అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్స్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని, వాటిలో లారీ చేజింగ్ సీన్స్ కూడా ఉన్నాయని సమాచారం. వాటిని బన్నీ డూప్ లేకుండా చేయబోతున్నాడని టాక్.


Click it and Unblock the Notifications











