అల్లు అర్జున్ గ్యారేజ్‌లో వాటి విలువ 12కోట్లు.. నచ్చితే ఎంత ఖర్చయినా తగ్గేదే లే..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అంటూ వివిధ రకాల ట్యాగ్స్ తో ట్రెండ్ అయ్యే అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియాలో ఒక పాత విషయంతోనే కొత్తగా వైరల్ అవుతున్నాడు. ప్రస్తుతం బన్నీ సంపాదనపై ఆస్తులపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే బన్నీ తన సంపాదనలో ఎక్కువగా కార్ల కోసమే ఖర్చు చేస్తాడని తెలుస్తోంది. ఇక ఆయన దగ్గర ఉన్న కార్ల లిస్టుపై ఒక లుక్కేస్తే...

అలా.. పాన్ ఇండియా రేంజ్..
అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆర్య, బన్నీ, దేశముదురు అంటూ వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడంతో అతని కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. కెరీర్ ను కొంచెంకొంచెంగా పెంచుకుంటూ.. అలా.. పాన్ ఇండియా రేంజ్ కు వచ్చేశాడు.

రెమ్యునరేషన్ ఎంతంటే..
అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. ఒకేసారి మార్కెట్ 200కోట్లకు వెళ్లడంతో బన్నీ వెంటనే పాన్ ఇండియా ఫార్మాట్ లోకి వచ్చేశాడు. పుష్ప సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెండు భాగాలకు కలిపి బన్నీ ఒకేసారి 70కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

తండ్రికి వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ..
ఇక అల్లు అర్జున్ ఎక్కువగా కార్లను ఇష్టపడతారని అందరికి తెలిసిందే. నచ్చితే ఎంత ఖర్చయినా పెట్టి కొనేస్తాడు. బన్నీ తన లైఫ్ లో ఏదైనా సరే లగ్జరిగా ఉండాలి అనుకుంటాడు. తండ్రికి కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన నుంచి డబ్బులు తీసుకొని ఏది కొనుక్కోలేదు. బన్నీ హీరోగా మారిన తరువాత అన్ని కూడా తన సొంత కష్టంతోనే సంపాదించుకున్నాడు. ఏ రోజు కూడా తండ్రి మీద అలాగే తన మామ సంపాదన మీద ఆశపడలేదు.
Recommended Video

కార్ల కోసమే 12కోట్లు..
ఇక ప్రస్తుతం బన్నీకి ఖరీదైన కారావాన్ ఉన్న విషయం తెలిసిందే. దానికి ఫాల్కన్ అని పేరు పెట్టుకున్నాడు. దాని విలువ దాదాపు 7కోట్లు ఉంటుంది. ఇక కార్ల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ గ్యారేజ్ లో వోల్వో ఎక్స్‌సి 90 టి8 ఎక్సలెన్స్, హమ్మర్ H2 , జాగ్వార్ XJL, రేంజ్ రోవర్ రోగ్, ఇలా విభిన్నమైన కాస్ట్లీ కార్లు ఉన్నాయట. వాటి మొత్తం విలువ 12కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











