For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నెంబర్ వన్ హీరోగా అల్లు అర్జున్ న్యూ రికార్డ్.. పోటీగా విజయ్ దేవరకొండ కూడా.. తగ్గేదే లే!

  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ టైం టాలీవుడ్ కి నటుడి గా పరిచయమైన మూవీ గంగోత్రి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాగానే సక్సెస్ సాధించింది. అయితే మొదట్లో అతను నటుడిగా ఏ మాత్రం సెట్టవ్వడు అని ఎన్నో కామెంట్స్ వచ్చాయి. కానీ అల్లు అర్జున్ టాలెంట్ ఏమిటో ఎవరు గుర్తించలేదు. సరైన కథ తగిలితే తన టాలెంట్ ఏమిటో నిరూపించుకోవాలని అనుకున్నడు. ఇక ఆ తరువాత సుకుమార్ తో ఆర్య మూవీ చేసి పెద్ద సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు.

  కేవలం సినిమాలతోనే కాకుండా తన స్టైల్ తో కూడా ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేశాడు. ఇక మారుతున్న కాలానికి తగ్గట్లుగానే బన్నీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంటర్నెట్ వరల్డ్ లో కూడా అతని స్థాయి అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డును అందుకున్నాడు. సౌత్ ఇండియాలోనే అతను నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు. ఇక అతని అనంతరం ఆ రికార్డును అందుకోవాడానికి విజయ్ దేవరకొండ కూడా వెనకాలే వస్తున్నాడు.

  MP Balashowry Vallabhaneni son Engagement.. చిరంజీవితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరయ్యారంటే!

  విబిన్నమైన సినిమాలతో..

  విబిన్నమైన సినిమాలతో..

  ఆర్య హిట్టయిన అనంతరం బన్నీ, పరుగు వంటి సినిమాల సక్సెస్ లతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా సక్సెస్ అందుకుని హీరోగా అయన క్రేజ్ మరింతగా పెంచాయి. ఇక పూరి జగన్నాథ్ తీసిన దేశముదురు, సురేందర్ రెడ్డి తీసిన రేసు గుర్రం, బోయపాటి శ్రీను సరైనోడు సినిమాలు అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ మూవీస్ గా నిలిచాయి. ఇక ఆ పైన హీరోగా మరిన్ని ఛాన్స్ ల తో కొనసాగిన అల్లు అర్జున్ తన స్టైల్ తో ప్రత్యేకంగా ఎంతోమంది ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకున్నారు.

  Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!

   కెరీర్ బిగ్గెస్ట్ హిట్

  కెరీర్ బిగ్గెస్ట్ హిట్

  ఆ విధంగా హీరోగా ఒక్కో సినిమాతో కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కొనసాగారు అల్లు అర్జున్. కాగా గత సంవత్సరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో మూవీ ఎంతో పెద్ద సక్సెస్ అందుకుని అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక అందులోని సాంగ్స్ నేషనల్ వైడ్ పాపులర్ అయి ఆయన క్రేజ్ ని విపరీతంగా పెంచాయి అనే చెప్పాలి. ఇక మొదటి నుండి సినిమాల స్టోరీ సెలెక్షన్ విషయంలో ఎంతో ఆచితూచి జాగ్రత్త వహించడంతో పాటు మావయ్య మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని అల్లుఅర్జున్ వేసే డ్యాన్స్ కి యువతలో విశేషమైన క్రేజ్ ఉంది.

  Jacqueline Fernandez ED విచారణ పూర్తి, స్టేట్మెంట్ రికార్డు.. అసలు ఏమైందంటే?

  నెంబర్ వన్ హీరోగా

  నెంబర్ వన్ హీరోగా

  కొన్నేళ్ల క్రితం పలు సోషల్ మీడియా అకౌంట్స్ లో ఖాతాలు తెరిచిన అల్లు అర్జున్, ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో వాటి ద్వారా టచ్ లో ఉంటూ సినిమాల అప్డేట్స్ ను అలానే వ్యక్తిగత విషయాలను వారితో షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. దాదాపుగా అన్ని సోషల్ మీడియా మాద్యమాల్లోను మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అసలు విషయం ఏమిటంటే, రీసెంట్ గా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 13 మిలియన్స్ ఫాలోవర్స్ ని అందుకుని సౌత్ ఇండియాలోనే అత్యధిక మంది ఫాలోవర్స్ కలిగిన స్టార్ గా గొప్ప రికార్డ్స్ సొంతం చేసుకున్నారు.

  RRR ఒలివియా మారిస్ హాట్ & క్యూట్ ఫొటోస్.. ఎన్టీఆర్ పాట్నర్ మామూలుగా లేదుగా..

  పోటీగా విజయ్ దేవరకొండ కూడా

  పోటీగా విజయ్ దేవరకొండ కూడా

  ఇంత గొప్పగా ప్రేక్షకాభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో కొద్దిసేపటి క్రితం పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అయితే అల్లు అర్జున్ తరువాత రెండవ స్థానంలో స్థానంలో 12.9 మిలియన్స్ ఫాలోవర్స్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. త్వరలోనే అతను కూడా బన్నీకి పోటీగా వస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొత్తంగా సౌత్ స్టార్స్ అందరిలోకి ఈ రికార్డు తో అల్లు అర్జున్ టాప్ స్థాయిలో నిలిచారు.

  Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Filmibeat Telugu
  వీరి సినిమాల విషయానికి వస్తే

  వీరి సినిమాల విషయానికి వస్తే

  ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నెవ్వర్ బిఫోర్ అనేలా పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని తన మార్కెట్ ను కూడా పెంచుకోవాలని అనుకుంటున్నాడు.

  ఇక విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా క్రిస్మస్ కు రావాల్సింది. కానీ షూటింగ్ పనులు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెయ్యి మందితో ఒక భారీ సీన్ ను కూడా షూట్ చేయాల్సి ఉండి.

  దాదాపు 35% షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక లైగర్ సినిమాను వచ్చే ఎడాది. రిలీజ్ చేయవచ్చని సమాచారం. ఇక విజయ్ , సుకుమార్ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Allu arjun new record in social media and vijay devarakonda also
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X