ద్విభాషా చిత్రంలో నటించబోతున్న అల్లు అర్జున్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత మరో ప్రాజెక్ట్ ప్రారంభించలేదు. అయినా కూడా ప్రతిరోజు బన్నీ గురించి ఏదో ఒక ఊహాగానం వినిపిస్తూనే ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం కథని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.
అల్లు అర్జున్ తదుపరి చిత్రాల జాబితాలో దర్శకుడు విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజగా బన్నీ నెక్ట్స్ మూవీ గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. చాలా రోజులుగా తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని భావిస్తోంది. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఇటీవల మాట్లాడుతూ అల్లు అర్జున్ తో సినిమా గురించి వివరించారు.

అల్లు అర్జున్ తో చేయబోయే చిత్రం ద్విభాషా చిత్రం కానీ లేక నేరుగా తెలుగు చిత్రం కానీ కావచ్చని అన్నారు. ఈ విషయంలో దర్శకుడు తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దర్శకుడు ఎవరనే విషయం మాత్రం ప్రకటించలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఫైనల్ కాగానే ప్రకటిస్తామని జ్ఞానవేల్ రాజా అన్నారు.


Click it and Unblock the Notifications











