బన్నీ సపరేట్‌గా ఓపెన్ చేసుకున్నాడట!
నా పేరు సూర్య చిత్రం తరువాత కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి అల్లు అర్జున్ ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా అల్లు అర్జున తదుపరి చిత్రానికి సంబందించిన అంశాలు ఎటూ తేలడం లేదు. కొత్త సినిమా సంగతేమో కానీ బన్నీ తాజగా కొత్తగా ఓ ఆఫీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
ఇప్పటివరకు బన్నీ తన ఆఫీస్‌గా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌నే ఉపయోగించుకుంటున్నాడు. తాజాగా జూబ్లీ హిల్స్‌లో అల్లు అర్జున్ కొత్తగా ఆఫీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇకపై అల్లు అర్జున్ సినిమాకు సంబందించిన చర్చలన్నీ కొత్త ఆఫీస్ నుంచే జరగనున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ దర్శత్వంలో ఉంటుందని, త్రివిక్రమ్ దర్శత్వంలో ఉంటుందని ఉహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. బన్నీ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఆలస్యమైనా ఈ సారి మంచి కథతో రావాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











