దర్శకుడికి టెన్షన్ లేకుండా చేసిన బన్నీ.. పుష్ప వచ్చేది ఎప్పుడంటే..?
అల్లు అర్జున్ ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు అంటే చాలా వరకు సినిమా పూర్తయ్యే వరకు దర్శకుడిపై టెన్షన్ పడకుండా ఉండాలని చూసుకుంటాడు. వీలైనంత వరకు సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా చర్చలు జరపడని ఒక టాక్ ఉంది. ఒకవేళ డేట్ ఫిక్స్ చేసుకొని షూటింగ్ స్పీడ్ గా చేస్తున్నప్పటికీ కరెక్ట్ గా రావడం లేదని తెలిస్తే తేదీలో మార్పులు చెయ్యడానికి కూడా వెనుకాడడు.
ఇక అల.. వైకుంఠపురములో సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి సంక్రాంతికి బాక్సాఫీస్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను కూడా అదే తరహాలో ఒక ఫెస్టివల్ టైమ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా డేట్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అసలైతే పుష్ప సినిమాను సమ్మర్ లో లేదా ఆగస్ట్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

కానీ సుకుమార్ మీద ఎంత ప్రెజర్ పెడితే అంత లేట్ చేస్తాడని బన్నీకి బాగా తెలుసు. పైగా తెలియకుండా పొరపాటు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బన్నీ వీలైనంత వరకు పుష్ప విషయంలో టెన్షన్ పెట్టకూడదని అనుకుంటున్నాడు.
ఎందుకంటే బన్నీకి ఇదే మొదటి ఫ్యాన్ ఇండియన్ సినిమా. అందుకే కూల్ గా వర్క్ చేసుకోమ్మని హ్యాపీగా దసరా సమయంలో సినిమాను రిలీజ్ చేసుకుందామని క్లారిటీ ఇచ్చేశాడట. దీంతో సుకుమార్ కూడా షెడ్యూల్ ప్లాన్స్ లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











