సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబో వెనుక అల్లు అర్జున్ హ్యాండ్.. షాకిస్తున్న రెమ్యునరేషన్స్

ఇటీవల కాలంలో కొంతమంది దర్శకులు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే వెంటనే మరొక సినిమాను ఎనౌన్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సుకుమార్ కూడా తన భవిష్యత్తు ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేసుకోవడంతో ఈ కాంబినేషన్ పై అప్పుడే ఒక మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే ఈ కాంబినేషన్ సెట్టవ్వడానికి అసలు కారణం అల్లు అర్జున్ అని తెలుస్తోంది.

ఒక ప్రాజెక్ట్ పూర్తయితే గాని

ఒక ప్రాజెక్ట్ పూర్తయితే గాని

సాధారణంగా సుకుమార్ ఒక కథను రాసుకుంటే సెట్స్ పైకి తేవడానికే చాలా సమయం తీసుకుంటాడు. ఇక సినిమాను షూటింగ్ మొదలు పెట్టిన తరువాత విడుదల చేయాలి అంటే అనుకున్న సమయం కంటే ఏడాది ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అనుకున్న కథ పర్ఫెక్ట్ గా రావాలని చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు కాబట్టి నిర్మాతలు హీరోలు కూడా సుక్కును పెద్దగా ఇబ్బంది పెట్టరు. మొత్తంగా ఈ దర్శకుడు ఒక ప్రాజెక్ట్ పూర్తయితే గాని మరొక కథను సెట్స్ పైకి తీసుకువెళ్లడు.

విజయ్ దేవరకొండతో సినిమా..

విజయ్ దేవరకొండతో సినిమా..

ఇక అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను సెట్స్ పైకి తెచ్చిన తరువాత సుకుమార్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకు కూడా ఎక్కువ సమయం తీసుకుంటాడని అంతా అనుకున్నారు. ఆ విషయాన్ని పక్కనపెడితే భవిష్యత్తు ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం ఆశ్చర్యకరం. సుకుమార్ జస్ట్ కాన్సెప్ట్ అనుకున్నాడో లేక లాక్ డౌన్ లో కథను రెడీ చేశాడో తెలియదు గాని విజయ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రాజెక్ట్ బ్యాక్ గ్రౌండ్ లో అల్లు అర్జున్

ప్రాజెక్ట్ బ్యాక్ గ్రౌండ్ లో అల్లు అర్జున్

ఇక ఈ సినిమా ద్వారా కొత్త నిర్మాత కెదార్ సెలగమ్‌శెట్టి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అతను ఎవరో కాదు. అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. అసలైతే బన్నీతో అలా సినిమా చేయాలని కేదార్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ కమిట్మెంట్స్ వల్ల బన్నీ అతనికి ఛాన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక ఫ్రెండ్ కోసం సుకుమార్ ని రంగంలోకి దింపి విజయ్ దేవరకొండను సెట్ చేశాడట.

Recommended Video

Thaman Vs Devi Sri Prasad : Musical Fight In Tollywood
షాకిస్తున్న రెమ్యునరేషన్స్..

షాకిస్తున్న రెమ్యునరేషన్స్..

ఇక సుకుమార్ కి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తునట్లు టాక్. విజయ్ తో కూడా పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ సినిమాకు దర్శకుడు అడ్వాన్స్ గా 10కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. బయట తన శిష్యులతో కొన్ని సినిమాలను నిర్మిస్తున్న కారణంగానే సుకుమార్ అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమాకు గట్టిగానే ఛార్జ్ చేస్తున్నట్లు టాక్. ఇక కేవలం రెమ్యునరేషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే మొత్తం సినిమా బడ్జెట్ ఇంకా ఎంత ఉంటుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X