అల్లు అర్జున్ డేరింగ్ డెసీషన్: కోట్లు పెట్టి కొన్న సినిమాను..

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్‌లలో రాణిస్తూ తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అంతేకాదు, సినిమా సినిమాకూ సరికొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే బడా బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఓ సినిమా విషయంలో డేరింగ్ డెసీషన్ తీసుకున్నాడట. ఆ వివరాలేంటో చూద్దాం.!

సంక్రాంతికి వచ్చాడు.. సత్తా చాటాడు

సంక్రాంతికి వచ్చాడు.. సత్తా చాటాడు

‘నా పేరు సూర్య' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. ఈ సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దుమ్ము దులిపేసింది. మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' నుంచి పోటీని తట్టుకుని రికార్డులు బద్దలు కొట్టింది.

అక్కడా.. ఇక్కడ రికార్డులు క్రియేట్ చేశాడు

అక్కడా.. ఇక్కడ రికార్డులు క్రియేట్ చేశాడు

ఎన్నో అంచనాలతో విడుదలైన ‘అల.. వైకుంఠపురములో' ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచే కలెక్షన్ల వేటను ప్రారంభించింది. మొదటి రోజు నుంచే సత్తా చాటిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 150 కోట్ల పైచిలుకు షేర్ సాధించడంతో పాటు ఓవర్సీస్‌లోనూ 3.5 మిలియన్ మార్కును చేరుకుంది. దీంతో పలు రికార్డులు బద్దలైపోయాయి.

ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతున్న బన్నీ

ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతున్న బన్నీ

‘అల.. వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో అతడు గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బన్నీ గుబురు గెడ్డంతో ఫుల్ మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడట. ఇందుకోసం అతడు ఎవరికీ కనిపించకుండా వెళ్లనున్నాడని సమాచారం.

సూపర్ హిట్ సినిమాను కొన్న అల్లు అర్జున్

సూపర్ హిట్ సినిమాను కొన్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ కొద్ది నెలల క్రితం హిందీలో సూపర్ హిట్ అయిన ‘సోనూకి టిటు కి స్వీటీ' అనే సినిమా రీమేక్ హక్కులు కొన్నాడు. వరుసగా సీరియస్ మోడ్ మూవీస్ చేస్తున్న బన్నీ.. దీన్ని రీమేక్ చేసి సరికొత్తగా కనిపించాలని భావించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ మూవీని తెరకెక్కించాలని భావించాడు. ఇంతలో త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ‘అల' చేశాడు.

 కోట్లు పెట్టి కొన్న సినిమా వేరే హీరోకు

కోట్లు పెట్టి కొన్న సినిమా వేరే హీరోకు

‘అల.. వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్ ‘సోనూకి టిటు కి స్వీటీ' రీమేక్‌ను పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరిగింది. కానీ, అతడు సుకుమార్‌తో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కూడా పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశాడు. దీంతో కోట్లు పెట్టి కొన్న ఈ సినిమాను వేరే హీరోతో చేయించాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడని తాజాగా ఓ వార్త లీక్ అయింది.

Recommended Video

Trivikram Srinivas Own Script For Allu Arjun | Filmibeat Telugu
‘సోనూకి టిటు కి స్వీటీ' గురించి

‘సోనూకి టిటు కి స్వీటీ' గురించి

2018లో బాలీవుడ్‌లో విడుదలైన చిత్రమే ‘సోనూకి టిటు కి స్వీటీ'. రంజన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, సన్నీ సింగ్, నుష్రత్ భరూచా కీలక పాత్రలు చేశారు. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ ఇది రూ. 150 కోట్లు వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమాను తమ తమ భాషల్లోకి తెరకెక్కించేందుకు చాలా మంది రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X