వకీల్ సాబ్ దర్శకుడిగా పోటీగా మాస్ డైరెక్టర్.. మళ్ళీ వెనక్కి తగ్గిన బన్నీ?

సినిమా ప్రపంచంలో దర్శకులకు కొన్నిసార్లు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒక సినిమా కథనం హీరో ఫైనల్ చేసిన తర్వాత కూడా వాటిని చర్చల దశలోనే ఆపేస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ కూడా చాలా సార్లు అదే తరహాలో కొన్ని సినిమాల విషయంలో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఐకాన్ సినిమా విషయంలో కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప మొదటి పార్ట్ ని విడుదల చేయడానికి సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇక రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే పుష్ప మొదటి భాగం పూర్తయిన తర్వాత బన్నీ సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ కథను పూర్తి చేసి దాదాపు ఏడాది అవుతోంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాను కూడా లైన్ లోకి తేవడంతో మళ్లీ ఆ కథను కూడా అన్ని భాషల్లోనూ విడుదల చేయాలని చెప్పాడట. దీంతో దర్శకుడు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశాడట. మొత్తానికి ఐకాన్ సినిమా స్క్రిప్ట్ ను అయితే పాన్ ఇండియా ప్రాజెక్టుగానే వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది.

Allu arjun plans changed on icon project and focus on new story

అయితే ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ మళ్ళీ తన ఆలోచనలను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా బోయపాటి శ్రీనుతో కూడా మరొక సినిమా చేయాలనే ఆలోచిస్తున్నాడు. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మాస్ దర్శకుడు పూర్తి స్క్రిప్ర్ ను సిద్ధం చేయడంతో ఐకాన్ సినిమాను పక్కన పెట్టేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర పాటు బన్నీ కోసం వెయిట్ చేస్తున్నా వేణు శ్రీరామ్ మధ్యలో వకీల్ సాబ్ సినిమా పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత ఐకాన్ సినిమా మొదలు పోతున్నట్లు పలు ఇంటర్వ్యూలలో దిల్ రాజు కూడా క్లారిటీ ఇచ్చాడు.

కానీ అల్లు అర్జున్ నుంచి మాత్రం పెద్దగా రియాక్షన్ రావడం లేదు. బన్నీ ఒక్కసారిగా కూడా ఐకాన్ షూటింగ్ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసి వచ్చే ఏడాది దసరా సమయంలో విడుదలకు సిద్ధం చేయాలని కూడా అనుకున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు బోయపాటి శ్రీను పూర్తి కథను సిద్ధం చేయడంతో అఖండ సినిమా తర్వాత అతనితో ప్రాజెక్టును మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ సినిమాను అతనికి పూర్తి చేశాడు. ఆ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుంది అనే దర్శకుడు నమ్మకంతో ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా అతనికి మంచి సాన్నిహిత్యం ఉండటంతో కొత్త ప్రాజెక్టును త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X