కూతురి కోసం చిన్నపిల్లాడిలా మారిపోయిన అల్లు అర్జున్.. ఇంతకంటే క్యూట్ మూమెంట్ మరొకటి ఉండదు!

మొత్తానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. పుష్ప సినిమా దాదాపు అన్ని భాషల్లోనూ మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో బన్నీ ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో గడిపేందుకు బన్నీ ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. ఇక ఇటీవల తన కూతురుతో అందుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్పతో బిగ్ హిట్

పుష్పతో బిగ్ హిట్


సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలోనే ఆ సినిమా 100కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అందుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తమిళం మలయాళం కూడా సినిమా పెట్టిన పెట్టుబడులకు డబుల్ ప్రాఫిట్స్ ను అయితే అందించింది.

సాధారణమైన విషయం కాదు..

సాధారణమైన విషయం కాదు..


దర్శకుడు సుకుమార్ - అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్టకాలంలో కూడా షూటింగ్ ఎన్నిసార్లు వాయిదా పడిన బన్నీ వెనక్కి తగ్గలేదు. ఓకే తరహా లుక్ తో దాదాపు ఏడాది పాటు అలానే ఉండాల్సి వచ్చింది. పుష్ప రాజ్ లుక్ తో నెలల పాటు అదే తరహాలో ఉండాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు.

సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ

సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ

ఇక అల్లు అర్జున్ పడిన కష్టానికి మొత్తానికి ప్రతిఫలం అయితే దక్కింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోవడంతో బన్నీ ఆ సక్సెస్ ను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల దుబాయ్ ట్రిప్ కూడా వెళ్ళాడు. అక్కడే కొన్ని రోజుల పాటు హాలిడేస్ ను ఎంజాయ్ చేసి రీసెంట్ గా ఇండియాకు తిరిగి వచ్చేశాడు.

కూతురితో బన్నీ ఆటలు

కూతురితో బన్నీ ఆటలు

సాధారణంగా అల్లు అర్జున్ ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తాడు. ఇక రానున్న రోజుల్లో పుష్ప 2తో బిజీ అవ్వాలి కాబట్టి బన్నీ ఇప్పుడు తన పిల్లలతో కాలక్షేపం చేస్తున్నాడు. తన కూతురు అర్హ ఆడుకుంటూ ఉండగా బన్నీ కూడా వారితో సరదాగా ఆడుకుంటూ ఉండడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోను బన్నీ సతీమణి స్నేహ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.

Recommended Video

Allu Arjun Promoting Other Films Too In Rowdy Boys Event.. హ్యాట్సాఫ్ బన్నీ ! | Filmibeat Telugu
రానున్న రోజుల్లో మరింత బిజీగా..

రానున్న రోజుల్లో మరింత బిజీగా..


ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ సుకుమార్ తో పుష్ప రెండవ భాగం షూటింగ్ కు ఫీనిషింగ్ టచ్ ఇవ్వనున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది. ఇక మొదటి భాగం సక్సెస్ కావడంతో రెండో భాగంలో కొన్ని ఎపిసోడ్స్ ను మరింత పవర్ఫుల్ గా తెరపైకి తీసుకు రావాలని అనుకుంటున్నారట. ఇక బన్నీ బోయపాటి శ్రీనుతో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక అగ్ర దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఐకాన్ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X