ఇంకా వెంటాడుతూనే ఉంది.. ‘కలర్ ఫోటో’పై బన్నీ ప్రశంసలు
ఇండస్ట్రీలో ఏదైనా మంచి సినిమా వస్తే ప్రశంసించేందుకు వాటిని ప్రోత్సహించేందుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముందుంటాడు. తనకు సినిమా నచ్చితే ఇంటికి పిలిచి మరీ పార్టీ ఇస్తాడు. సినిమా ఫ్యామిలీ అందరిన్నీ పిలిచి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తాడు. తాజాగా సినీ ప్రముఖులందరూ కలర్ ఫోటో సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అందర్నీ కట్టిపడేస్తోంది.
నిన్ననే మాస్ మహారాజ రవితేజ్ కలర్ ఫోటో డైరెక్టర్, హీరోను ప్రత్యకంగా కలిసి అభినందించాడు. డైరెక్టర్ సందీప్ రాజ్ అద్భుతంగా తెరకెక్కించాడని, సుహాస్ పర్ఫామెన్స్ బాగుందని మెచ్చుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కూడా చిత్రయూనిట్ మొత్తాన్ని అభినందించాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా తన ఆఫీస్‌కు పిలిపించుకుని స్పెషల్ విషెస్ అందించాడు. దర్శకుడు సందీప్ రాజ్‌కు ఓ మొక్కను కూడా అందించాడు.

కలర్ ఫోటో టీం మొత్తానికి కంగ్రాట్స్.. ఎంతో స్వీట్ లవ్ స్టోరీ.. ఆ మ్యూజిక్, ఎమోషన్స్, వారి నటన ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. చాలా రోజుల తరువాత ఓ మంచి సినిమా చూడటం ఆనందంగా ఉందంటూ దర్శకుడు సందీప్, సుహాస్, చాందినీ చౌదరి, వైవా హర్ష, కాళ భైరవ ఇలా టీం మొత్తాన్ని అభినందించాడు. దర్శకుడికి బన్నీ ఓ మొక్కను కూడా ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











