అల్లు అర్జున్ కు ఘోర అవమానం.. బన్నీపై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్..

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ మూవీకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూవీకి సంబంధించిన ఈవెంట్లు నిర్వహించారు. నిన్న కేరళలోని కొచ్చిలో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. అయితే.. ఈవెంట్ లో అల్లు అర్జున్ కు అవమానం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస విజయాలు అందుకుంటూ.. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారారు. ఇక పుష్ప మూవీతో అల్లు అర్జున్ కు ఎనలేని పాపులారిటీ వచ్చింది. అప్పటివరకు సౌత్ ఇండియాలోనే ఫాన్స్ ఉండే అతనికి నార్త్ లోను విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. అలాగే తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోగా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. అలాంటి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Allu Arjun Pushpa 2 Kochi event anchors got confused Allu Arjun was trolled

ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్లకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ విడుదలకు ముందే 1,000 కోట్ల పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇటీవల విడుదలైన టీజర్ స్పెషల్ సాంగ్ నెట్ ఇంట్లో ఇప్పటికి ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది మూవీ ప్రమోషన్స్ ను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు కేరళలోని కొచ్చి లో పుష్ప2 మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు భారీ ఎత్తున మలయాళ ఫ్యాన్స్ వచ్చారు.

కొచ్చి లో జరిగిన పుష్ప2 ప్రమోషన్స్ ఈవెంట్ లో హీరో అల్లు అర్జున్ కు అవమానం జరిగింది. అసలేం జరిగిందంటే? అల్లు అర్జున్ ని స్టేజ్ పైకి పిలిసే ముందు యాంకర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. బన్నీకి, బన్ని వాసుకి తేడా తెలుసుకోలేకపోయారు. బన్నీ అని పిలువడానికి బదులు వాసు బన్నీకి పిలువడంతో అందరూ షాక్ అయ్యిరు. అల్లు అర్జున్ ను పిలిచే సమయంలో గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ బన్నీ వాసుగా అల్లు అర్జున్ ను ఇన్వైట్ చేయడంతో అభిమానులందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న యాంకర్లు అల్లు అర్జున్ అంటూ బన్నీని స్టేజ్ పైకి ఆహ్వానించారు. అయితే ఈ చిన్న అపశృతి నెట్టింట్లో వైరలవుతోంది.

దొరికిందే అవకాశం గా అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఫ్యాన్ ఇండియా స్టార్ .. ఐకాన్ స్టార్ అంటూ భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. కనీసం అల్లు అర్జున్ పేరు కూడా తెలియదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. బన్నీకి వాసు బన్నీకి మలయాళం లోనే తెలియడం లేదు. అలాంటి నార్త్ ఇండియాలో పరిస్థితి ఏంటి అంటూ ఆంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడిన విధానంపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈవెంట్లో అల్లుఅర్జున్ కేరళ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. మలయాళం లో కూడా మాట్లాడడానికి ట్రై చేశారు. ముందుగా మలయాళం నటుడు పహాద్ పజిల్ ను హైలెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత బన్నీ ఆర్మీ గురించి మాట్లాడుతూ ఆర్మీ అనేది కేరళ నుంచి వచ్చిందని, కేరళ అభిమానులే.. తమని తాము బన్నీ ఆర్మీగా పిలుచుకున్నారంటూ అల్లు అర్జున్ అన్నారు. అలాగే తన స్పీచ్లో పదేపదే అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ అని తనను తాను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ కామెంట్స్ పై కూడా బన్నీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ గురి చేస్తున్నారు బన్నీ ఆంటీ ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X