Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Allu Arjun పుష్ప 2 కోసం న్యూ స్టైల్.. ఈ లుక్ మామూలుగా లేదు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి ఐకాన్ స్టార్ గా క్రేజ్ గా అందుకుంటున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సెకండ్ పార్ట్ కోసం ప్రస్తుతం దేశమంతా కూడా ఎదురుచూస్తోంది. పుష్ప 2 సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వంద కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తో అంతకుమించి అనేలా ఆడియన్స్ మెప్పించాలని అనుకుంటున్నాడు.
అయితే ఈ క్రమంలో స్క్రిప్ట్ విషయంలో కూడా దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో అనుకున్న స్క్రిప్టును మళ్లీ కొంత చేంజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంతవరకు ఎక్కువ గ్రాండియర్ గా సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ సెకండ్ పార్ట్ లో ఇంకాస్త కొత్తగా కనిపిస్తాడు అని తెలుస్తోంది.

అందుకోసం ప్రత్యేకంగా ఇటీవల ఒక లుక్ కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో కూడా వైరల్ గా మారిపోయింది. అల్లు అర్జున్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్లు కాకుండా సెకండ్ పార్ట్ లో మాత్రం ఇంకాస్త జుట్టును పెంచి భిన్నంగా కనిపిస్తాడు అని తెలుస్తోంది. అయితే పుష్ప రాజ్ క్యారెక్టర్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చేయడం లేదట.
ఇక వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. పుష్ప సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ విషయంలో జరిగిన పొరపాట్లు సెకండ్ పార్ట్ విషయంలో జరగకుండా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అని అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సుకుమార్ ఆలోచిస్తున్నాడు. మరి సెకండ్ పార్ట్ తో అల్లు అర్జున్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.