Pushpa 2: సాయి పల్లవి రోల్ పై చర్చ.. తేల్చి చెప్పేసిన నిర్మాతలు!

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా మాస్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ కథను మరింత బలంగా తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు అన్నీ కూడా పూర్తయ్యాయి.

ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలి అని చిత్ర యూనిట్ సభ్యులు షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫైనల్ లుక్ కూడా రెడీ అయింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో బన్నీ కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే సినిమాలో మరికొన్ని పాత్రలలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి పార్ట్ లో ఉన్న అనసూయ అలాగే సునీల్ ఫాహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్ లో కూడా కనిపించబోతున్నారు.

Allu arjun pushpa 2 movie sai pallavi role fake and production house clarification

అయితే మరికొన్ని పాత్రలు కూడా ఎక్కువగా సెకండ్ పార్ట్ లో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ మరో పవర్ఫుల్ లేడీ పాత్ర కోసం ఒక ప్రముఖ హీరోయిన్ ని సంప్రదించినట్లుగానే కరకాల కథనాలు అయితే వెలువడ్డాయి. ముఖ్యంగా సాయిపల్లవి పై ఫోకస్ చేసినట్లు కూడా ఆ మధ్యలో టాక్ అయితే గట్టిగానే వినిపించింది. అయితే ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ అయితే ఇచ్చేశారు. ప్రస్తుతం పలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న వివరాలు ఏమాత్రం నిజం లేదు అని సినిమాకు సంబంధించిన పాత్రల విషయంలో అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు ఆకల్సిందేనని తేల్చి చెప్పేశాడు.

మొన్నటివరకు సాయి పల్లవి అల్లు అర్జున్ కాంబినేషన్ అందరు ఫిక్స్ అయిందని అనుకొని ఎంతో సంబరపడ్డారు. అలాంటి కాంబినేషన్ ఒక్కసారి సెట్ అయితే వెండితెరపై ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు సాయి పల్లవి పాత్ర నిజం కాదు అని దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పై ఫోకస్ చేసినట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఒక స్పెషల్ ఐటెం సాంగ్ హైలెట్ కాబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X