Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తగ్గేదే లే అంటున్న పుష్ప రాజ్: మరోసారి టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో RRR అనంతరం బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న సినిమాల్లో పుష్ప ఒకటి. సుకుమర్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప టీజర్ భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకున్న విషయం తెలిసిందే.
రోజురోజుకు పుష్ప టీజర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను అందుకుంటోంది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో అత్యదిక వ్యూవ్స్ అందుకున్న టీజర్ గా కూడా రికార్డును అందుకుంది. 60 మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న పుష్పరాజ్ 1.4మిలియన్ లైక్స్ అందుకున్నాడు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. పోటీగా RRR టీజర్ వచ్చినప్పటికీ పుష్ప రాజ్ గత రెండు రోజుల్లోనే మరింత స్పీడ్ పెంచాడు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దేవి శ్రీ ప్రసాద్ డిఫరెంట్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల బన్నీ కోవిడ్ నుంచి కోలుకోవడంతో సుకుమార్ టీమ్ మళ్ళీ షూటింగ్ విషయంలో స్పీడ్ పెంచాలని అనుకుంటోంది. వీలైనంత వరకు అనుకున్న టైమ్ లోనే పనులన్నిటిని పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.