అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్... ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం.. ఇలా అడిగితే ఎవరికి నచ్చిన హీరో పేరును వాళ్లు చెప్పుకుంటారు. అయితే ఈ టాప్ 10 హీరోల జాబితాను ప్రతి నెల ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేసింది ఈ సంస్థ. అయితే ఇందులో మెగా హీరోలు అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ చోటు దక్కించుకున్నారు. మరి వీరిలో ఎవరికి ఎక్కువ క్రేజ్? ఎవరు ఎక్కువ ప్రేక్షకుల్లో ఆదరణ పొందుతున్నారు? అసలు టాప్ 1 హీరో ఎవరు అనేది? ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.

ఆర్మాక్స్ సర్వే...
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో అంటే ఎన్టీఆర్, ఎన్నాఆర్, కృష్ణ అంటూ చెప్పుకునే వాళ్లం. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున అంటూ చెప్పుకున్నాం. మరి ఈ తరంలో ఎవరు టాప్ హీరో అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎవరికి ఉండే ప్రత్యేకత వారికి ఉంటుంది. ఒకరు టాప్ అని చెప్పలేం. అందుకే ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ వీటిపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా, ఆన్ లైన్ ద్వారా సర్వే నిర్వహించి లిస్టును రిలీజ్ చేస్తూ ఉంటుంది.

Allu Arjun Ram Charan Chiranjeevi Pawan Kalyan Do you know who has more craze

టాప్ 10 హీరోల లిస్ట్...
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేసింది సంస్థ. అయితే టాప్ 10 హీరోలు ఎవరు ఏంటి అనేది చూసుకుంటే.. అందులో మ్యాక్సిమమ్ మెగా హీరోలు చోటు దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరూ టాప్ 10 హీరోల జాబితాల్లో చోటు దక్కించుకున్నారు. అయితే వీరిలో ఎవరికి ఎక్కువ క్రేజ్ అంటే మాత్రం ఈ లిస్టు ప్రకారం.. అల్లు అర్జున్ అని తెలుస్తోంది.

మొదటి స్థానంలో ప్రభాస్...
పూర్తి వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ టాప్ 10 హీరోల్లో మొదటి స్థానం రెబల్ స్టార్ ప్రభాస్ దక్కించుకున్నాడు. ఆ తర్వాతి 2,3 స్థానాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఇక నాలుగవ, ఐదవ స్థానాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆ తర్వాతి స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. వీరి తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 6వ స్థానంలో ఉండగా, 7వ స్థానంలో నేచురల్ స్టార్ నాని నిలిచారు. ఇక 8వ స్థానంలో మాస్ మహారాజ్ రవితేజ నిలిచాడు.

మెగా హీరోల్లో క్రేజ్ ఆ ఇద్దరికే...
ఇక తొమ్మిదో స్థానంలో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇక పదో స్థానంలో మన మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఇక ఈ లిస్టు ప్రకారం మెగా హీరోల్లో ఎక్కవగా క్రేజ్ మాత్రం అల్లు అర్జున్, రామ్ చరణ్ కు ఉందని చెప్పవచ్చు. ఇవండి ఆర్మాక్స్ మీడియా టాప్ 10 టాలీవుడ్ హీరోల లిస్టు. మీ హీరో ఎవరైనా మిస్ అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X