అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డ్: విజయ్ దేవరకొండ తర్వాత టాలీవుడ్ నుంచి బన్నీనే!
'గంగోత్రి' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన అతడు.. అద్భుతమైన టాలెంట్‌తో అదరగొట్టేశాడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఫలితంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ అరుదైన రికార్డ్‌ను అందుకున్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అతడికి ఖాతాలు ఉన్నాయి. వాటన్నింటి ద్వారా తనకు, తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తుంటాడు. దీంతో అతడిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పది మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఈ ఘనతను అందుకుని.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తర్వాత ఈ ఫీట్‌ను చేరుకున్న టాలీవుడ్ హీరోగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ విషయంపై తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టాడు బన్నీ. ఓ స్పెషల్ మీడియోను షేర్ చేసిన అతడు.. 'నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు.. నా వెన్నంటి ఉంటూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ నన్ను టచ్ చేసింది' అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'పుష్ప'లో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











