For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ అరుదైన రికార్డు: సినిమాల్లోనే కాదు అందులోనూ నెంబర్ వన్..సౌత్‌లో ఏకైక హీరో అతడే

  |

  టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తన హవాను చూపిస్తున్నాడు. అదే సమయంలో జయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఫలితంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ సౌతిండియాలోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

  ‘పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గా బన్నీ

  ‘పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గా బన్నీ

  ‘అల.. వైకుంఠపురములో' మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతుంది.

  అక్కడా ఇక్కడా ఫాలోయింగ్ సొంతమైంది

  అక్కడా ఇక్కడా ఫాలోయింగ్ సొంతమైంది

  సినిమాల పరంగా అల్లు అర్జున్ ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే పరిమితం అయిపోలేదు. అతడికి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందే.. అదే రీతిలో కేరళలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సొంతం అయింది. అందుకే బన్నీ నటించే ప్రతి సినిమానూ మాలీవుడ్‌లోనూ విడుదల చేస్తున్నారు. అంతేకాదు, అక్కడ ఏదైన సమస్య వస్తే బన్నీ ఎన్నో సార్లు విరాళాలు కూడా అందించిన విషయం తెలిసిందే.

  అలా వాళ్లకు కూడా దగ్గరైన అల్లు అర్జున్

  అలా వాళ్లకు కూడా దగ్గరైన అల్లు అర్జున్

  కేరళ ప్రేక్షకులకు దగ్గరైనట్లుగానే.. తన డబ్బింగ్ చిత్రాల ద్వారా ఉత్తరాది సినీ ప్రియులకు సైతం చేరువ అయ్యాడు అల్లు అర్జున్. అందుకే అతడు నటించిన ప్రతి సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోతున్నాయి. అందుకు తగ్గట్లుగానే యూట్యూబ్‌లో ఈ సినిమాలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి భారీ స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.

  అందులో యమ యాక్టివ్.. హల్‌చల్ చేసి

  అందులో యమ యాక్టివ్.. హల్‌చల్ చేసి

  జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు అల్లు అర్జున్. అంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అతడు ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను పంచుకుంటున్నాడు. అదే సమయంలో మూవీ అప్‌డేట్లు కూడా ఇస్తున్నాడు.

  అరుదైన మైలురాయిని అందుకున్న స్టార్

  అరుదైన మైలురాయిని అందుకున్న స్టార్

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. అన్ని ప్రాంతాలకు చెందిన అభిమానులు అతడిని ఫాలో అవుతుండడం వల్ల ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలోనే ఈ స్టార్ హీరో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 12 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే విజయ్ దేవరకొండ ఈ ఫీట్ అందుకున్నాడు.

  సినిమాల్లోనే కాదు అందులోనూ తోపులా

  సినిమాల్లోనే కాదు అందులోనూ తోపులా

  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్లను, ఫేస్‌బుక్‌లో 21 మిలియన్ ఫాలోవర్లను, ట్విట్టర్‌లో దాదాపు 6 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్నాడు. అదే సమయంలో పలు యాప్‌లలోనూ ఒక మిలియన్‌కు పైగానే ఫాలోవర్లను సంపాదించుకుని సత్తా చాటాడు.

  Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu
  దక్షిణాదిలోనే ఏకైక హీరోగా రికార్డు సొంతం

  దక్షిణాదిలోనే ఏకైక హీరోగా రికార్డు సొంతం

  చాలా ఏళ్లుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాడు. తాజాగా అతడు మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అన్ని అకౌంట్లను కలిపి 40 మిలియన్లకు పైగా ఫాలోవర్లను అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి సౌతిండియన్ హీరోగా బన్నీ రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో అతడి పేరు దక్షిణాది మొత్తం మారుమ్రోగిపోతోంది.

  English summary
  Tollywood Star Hero Allu Arjun Very Active in Social Media. Now he Reached 40 Million Followers in All Account. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే అన్ని సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా తాజాగా 40 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X