పండుగ పూట అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరో!

'పుష్ప' సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పుష్ప చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే మరో రికార్డు బద్దలు కొట్టారు. ఆ వివరాలు

సోషల్‌ మీడియాలో యాక్టివ్

సోషల్‌ మీడియాలో యాక్టివ్

2020లో "అల వైకుంఠపురంలో" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాతో 2021లో కూడా సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక బాలీవుడ్‌లో ఇప్పటికే ఏకంగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వంద కోట్ల వైపు దూసుకెళుతోంది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 రికార్డు

రికార్డు

సినిమా విషయాలతో పాటు తన పిల్లలు, తదితర వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకుంటాడు. అందుకే అతనికి రోజు రోజుకి ఫాలోవర్స్‌ పెరిగిపోతున్నారు. మిగతా హీరోలతో పోల్చుకుంటే అల్లు అర్జున్ కు మిగతా భాషల నుంచి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫాలోవర్ ల జాబితా పెంచుకుంటూ పోతున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా రికార్డు సృష్టించాడు.

తొలి హీరో బన్నీ

తొలి హీరో బన్నీ

భోగి రోజున బన్నీకి ఇన్ స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ చేరారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీ కావడం విశేషం. తనకు 15 మిలియన్ ఫాలోవర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా సంపాదించుకున్నారు.

 300 కోట్ల వసూళ్లను రాబట్టి

300 కోట్ల వసూళ్లను రాబట్టి

దక్షిణాది హీరోల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే బన్నీకి దగ్గర్లో ఉన్నాడు. ఈ టాలీవుడ్ హీరోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది. గత ఏడాది డిసెంబర్ 17న రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

త్వరలో షూట్

త్వరలో షూట్

2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచినా ఈ సినిమా బన్ని కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాగా కూడా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా రావాల్సి ఉన్న పుష్ప రెండో భాగం ది రూల్ త్వరలో షూట్ మొదలు కావాల్సి ఉంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X