తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. పది రోజుల్లో మిలియన్.. మాములుగా లేదుగా!

పది రోజుల క్రితం, సంక్రాంతి సందర్భంగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సాధించారు. ఆ సమయంలో తనను ఫాలో అయిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక చిత్రాన్ని పంచుకున్నాడు. అది జరిగి పది రోజులు కూడా కానేలేదు మరో మిలియన్ ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఆ వివరాల్లోకి వెళితే

పాన్‌ ఇండియా స్టార్‌గా

పాన్‌ ఇండియా స్టార్‌గా


'పుష్ప' సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు టాలీవుడ్ స్టయిలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పుష్ప చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలీవుడ్‌లో ఇప్పటికే ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలన రికార్డులు సృష్టించింది.

రీమేక్ ల ట్రెండ్‌కు ముగింపు

రీమేక్ ల ట్రెండ్‌కు ముగింపు


సౌత్ సినిమా, 2020-21లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప: ది రైజ్ నార్త్ లో విజయం సాధించడంతో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు అని నిరూపించింది. హిందీ సినిమా ఇప్పటికీ రీమేక్‌ల కోసం వెతుకుతున్నప్పటికీ, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ తమ తమ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో ఇప్పటికే ఆ రీమేక్ ల ట్రెండ్‌కు ముగింపు పలికింది.

 300 కోట్ల రూపాయలు దాటి

300 కోట్ల రూపాయలు దాటి

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప స్పైడర్‌మ్యాన్ మరియు 83' వంటి భారీ-టికెట్ చిత్రాలతో పాటు విడుదలైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు దాటింది. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం 95 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

భోగి రోజున

భోగి రోజున

భోగి రోజున బన్నీకి ఇన్ స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ చేరారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీ కావడం ఒక విశేషం. తనకు 15 మిలియన్ ఫాలోవర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఒక పోస్ట్ కూడా పంచుకున్నారు.

Recommended Video

Pushpa Movie : Sukumar బిగ్ హార్ట్ .వా ళ్ళందిరికి లక్ష | Allu Arjun | Filmibeat Telugu
పది రోజుల్లోనే వన్ మిలియన్‌

పది రోజుల్లోనే వన్ మిలియన్‌

అలా పంచుకున్నాడో లేదో ఒక పది రోజులు గడిచిన వెంటనే ఆయనకు మరో మిలియన్ ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇక ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా సంపాదించుకున్నారు. ఇక దక్షిణాది హీరోల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే బన్నీకి దగ్గర్లో ఉన్నాడు. ఈ టాలీవుడ్ హీరోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక బన్నీ కేవలం పది రోజుల్లోనే వన్ మిలియన్‌ని అందుకున్న అరుదైన ఫీట్‌ను చూస్తే త్వరలో 20 మిలియన్ల మార్క్‌ను దాటడంలో ఆశ్చర్యం లేదు అని భావిస్తున్నారు. చూడాలి పుష్ప 2 లోపు ఆ ఘనత సాధిస్తాడు ఏమో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X