Allu Arjun: ఐకాన్ స్టార్ పెను సంచలనం.. ఏకంగా అన్ని కోట్లు.. ఏకైక సౌత్ హీరోగా రికార్డు

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆరంభంలోనే యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఫాలోయింగ్, మార్క్‌ట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అదే సమయంలో జయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ఇండియాలోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

ఇక్కడే కాదు.. అక్కడా ఫాలోయింగ్

ఇక్కడే కాదు.. అక్కడా ఫాలోయింగ్

అల్లు అర్జున్ సినిమాల పరంగా ఒక్క టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అయిపోలేదు. అతడికి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందే.. అదే రీతిలో కేరళలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సొంతం అయింది. అందుకే బన్నీ నటించే ప్రతి సినిమానూ అక్కడ కూడా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అంతేకాదు, అక్కడ ఏదైన సమస్య వస్తే అతడు ఎన్నో సార్లు విరాళాలు కూడా అందించిన సంగతి విధితమే.

ఉత్తరాది వాళ్లకు ఎప్పుడో తెలుసు

ఉత్తరాది వాళ్లకు ఎప్పుడో తెలుసు

కేరళ వాళ్లకు దగ్గరైనట్లుగానే.. తన డబ్బింగ్ చిత్రాల ద్వారా ఉత్తరాది సినీ ప్రియులకు సైతం అల్లు అర్జున్ చేరువ అయ్యాడు. అందుకే అతడు నటించిన ప్రతి సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోతున్నాయి. అందుకు తగ్గట్లుగానే యూట్యూబ్‌లో ఈ సినిమాలకు ఊహించని రీతిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవి భారీ స్థాయిలో వ్యూస్‌ను అందుకుంటున్నాయి

‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌కు

‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌కు

కెరీర్‌ను మొదలెట్టినప్పటి నుంచి టాలీవుడ్‌కే పరిమితం అయిన అతడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం అయిపోయింది.

అందులో కూడా బన్నీ యాక్టివ్‌గానే

అందులో కూడా బన్నీ యాక్టివ్‌గానే

అల్లు అర్జున్ కెరీర్ ఆరంభం నుంచే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. అంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అతడు ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను పంచుకుంటున్నాడు. అలాగే, పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తున్నాడు.

గొప్ప మైలురాయిని చేరుకున్నాడు

గొప్ప మైలురాయిని చేరుకున్నాడు

సినిమాల్లో మాదిరిగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలోనే ఫాలోయింగ్ ఉంది. అన్ని ప్రాంతాలకు చెందిన అభిమానులు అతడిని ఫాలో అవుతుండడం వల్ల ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలోనే ఈ స్టార్ హీరో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 20 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకుని అరుదైన ఘనతను అందుకున్నాడు.

సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేస్‌కు

సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేస్‌కు

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. తద్వారా సౌత్ ఇండియాలోనే ఈ మార్కును చేరుకున్న లేదా ఎక్కువ మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఏకైక హీరోగా అతడు చరిత్ర సృష్టించాడు. దీంతో బన్నీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరినట్లు అయింది.

ఓవరాల్‌గా వాళ్లందరి తర్వాతనే

ఓవరాల్‌గా వాళ్లందరి తర్వాతనే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 20 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుని సౌతిండియాలో రికార్డు సాధించాడు. అయితే, ఓవరాల్‌గా చూస్తే మాత్రం అతడిది ఏకంగా 64వ స్థానం కావడం విశేషం. బన్నీ కంటే ముందు పలువురు క్రీడా, వ్యాపార, సినీ ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఇందులో కోహ్లీ 237 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X