Allu Arjun: బన్నీ ఖాతాలో సెన్సేషన్ రికార్డు.. సౌత్‌లోనే ఏకైక హీరోగా.. ఆ స్టార్లు దగ్గరలో కూడా లేరుగా!

బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినీ రంగం ప్రవేశం చేసినా.. తనదైన టాలెంట్లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హీరోగా పరిచయమైన కొత్తలోనే యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఫాలోయింగ్, మార్క్‌ట్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటూనే ఉన్నాడు.

ఈ క్రమంలోనే 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ తాజాగా సౌతిండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

Allu Arjun Pushpa

పాన్ ఇండియా స్టార్‌గా బన్నీ: మొదటి నుంచీ టాలీవుడ్‌కే పరిమితం అయిన అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Allu Arjun Reaches 50 Million Followers

రూల్ చేయడానికి రెడీగానే: ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'పుష్ప ది రూల్'లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. దీన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తీస్తున్నారు. దీనితో పాటు అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

Allu Arjun Reaches 50 Million Followers

అప్పట్లోనే ఫుల్ ఫాలోయింగ్: సినిమాల పరంగా అల్లు అర్జున్ ఒక్క టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అయిపోలేదు. అతడికి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో.. అదే రీతిలో కేరళలోనూ అభిమానాన్ని అందుకున్నాడు. అందుకే బన్నీ నటించే ప్రతి సినిమానూ అక్కడ కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, అక్కడ ఏదైన సమస్య వస్తే అతడు వెంటనే స్పందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

Allu Arjun Reaches 50 Million Followers

డబ్బింగ్ చిత్రాలతో అక్కడ: మలయాళ ప్రేక్షకులకు దగ్గరైనట్లుగానే.. తన డబ్బింగ్ చిత్రాల ద్వారా ఉత్తరాది సినీ ప్రియులకు సైతం అల్లు అర్జున్ చేరువ అయ్యాడు. అందుకే అతడు నటించిన ప్రతి సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయేవి. అందుకు తగ్గట్లుగానే యూట్యూబ్‌లో ఈ సినిమాలకు ఊహించని రీతిలో స్పందన వస్తుంది. తద్వారా అతడికి అప్పట్లోనే క్రేజ్ ఏర్పడింది.

Allu Arjun Reaches 50 Million Followers

సోషల్ మీడియాలో యాక్టివ్: కెరీర్ ఆరంభం నుంచే అల్లు అర్జున్ జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్నాడు. అంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అతడు ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను పంచుకుంటున్నాడు. అలాగే, పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఫొటోలను వదులుతున్నాడు.

Allu Arjun Reaches 50 Million Followers

అక్కడ అరుదైన రికార్డుతో: టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. అందుకు అనుగుణంగానే తాజాగా అతడు అన్ని అకౌంట్లను కలిపి 50 మిలియన్లకు పైగా ఫాలోవర్ల మార్కును చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సౌతిండియన్ హీరోగా బన్నీ రికార్డును క్రియేట్ చేశాడు. అతడికి దరిదాపుల్లో కూడా ఏ స్టార్ హీరో లేకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X