బన్నీ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జి.. ఎమోషనల్‌గా అల్లు అర్జున్ పోస్ట్.. అభిమానుల ఫిదా
టాలీవుడ్ బెస్ట్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటైన అల్లు అర్జున్ పుష్ప మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ విషయంలో మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో అడుగులు వేయడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ మాత్రం తనదైన శైలిలో ప్రమోషన్స్ చేస్తూ అడుగులు వేస్తున్నాడు అయితే. రీసెంట్ గా ఫ్యాన్స్ మీట్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అల్లు అర్జున్ కు చేదు అనుభవం ఏర్పడింది. అంతే కాకుండా అభిమానులను కూడా గాయాలపాలవ్వడంతో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు.

భారీ స్థాయిలో ఈవెంట్
ఇటీవల హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వేడుకలో భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ కూడా అభిమానుల తాకిడి చాలా ఎక్కువ అయింది. వారిని కంట్రోల్ చేసేందుకు నిర్వాహకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా భారీ స్థాయిలో నిర్వహించడంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఫ్యాన్స్ మీట్..
అయితే పుష్ప సినిమా ప్రమోషన్ విషయంలో అల్లు అర్జున్ సోలో గా ముందుకు వెళుతున్నాడు. ఇక అభిమానులను కూడా కలుసుకునేందుకు ఆసక్తి చూపించాడు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో ఫాన్స్ మీట్ పేరుతో అభిమానులకు ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగాలని అనుకున్నాడు. అయితే ఆ ప్లాన్స్ ఒక్కసారిగా తారుమారయ్యాయి. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో నిర్వాహకులు వారిని కంట్రోల్ చేయలేకపోయారు

లాఠీచార్జ్ తప్పలేదు
ముందుగానే నిర్వాహకులు అభిమానులకు ప్రత్యేకంగా పాసులు కూడా కేటాయించారు. అయితే ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వచ్చిన అభిమానుల సంఖ్య అనుకున్నదానికంటే ఎక్కువ కావడంతో నిర్వాహకులు వారిని ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. ఇక ఓపిక నశించడంతో అభిమానులు ఒక్కసారిగా గేట్లను బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కొన్ని అద్దాలు కూడా పగిలిపోవడంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి తీవ్రంగా విషమించ కూడదు అని పోలీసులు కూడా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

అల్లు అర్జున్ ట్వీట్
ఘటనపై వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు కూడా జాగ్రత్తలు వహించారు. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సంఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఈరోజు జరిగిన ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌లో నా అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నా బృందం పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తోంది మరియు నన్ను అప్‌డేట్ చేస్తోంది. ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. మీ ప్రేమ మరియు అభిమానం నా అతిపెద్ద ఆస్తి.. అంటూ బన్నీ ఎమోషనల్ గా ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Recommended Video

భారీ బడ్జెట్ తో..
ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా అల్లు అర్జున్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. దాదాపు 190 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











