గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్, ఆందోళన అవసరం లేదు.. త్వరలోనే మరొక పవర్ఫుల్ అప్డేట్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమా స్టార్ట్ చేశాడు అంటే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటాడు. ఇటీవల కోవిడ్ భారిన పడిన అల్లు అర్జున్ మొత్తానికి కొలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. ఇక పుష్ప సినిమా అనంతరం బన్నీ చేయబోయే సినిమాపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఆ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నాడు.

Recommended Video

Acharya కోసం Pushpa Raj తగ్గుతాడా? | Allu Arjun | Megastar Chiranjeevi || Filmibeat Telugu
కోవిడ్ పాజిటివ్ రావడంతో

కోవిడ్ పాజిటివ్ రావడంతో

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేశాడు. మొన్నటి వరకు గ్యాప్ లేకుండా చాలా వేగంగా వర్క్ చేశారు. అయితే కోవిడ్ పాజిటివ్ రావడంతో అల్లు అర్జున్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి సినిమా షెడ్యూల్స్ అన్ని కూడా తారుమారయ్యాయి.

ఆందోళన అవసరం లేదు

ఆందోళన అవసరం లేదు

ఇక కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అందరికీ హలో! నేను చాలా తేలికపాటి లక్షణాలతో కరోనా నుంచి కొలుకుంటున్నాను. ఆందోళన చెందడానికి ఏమీ లేదు. నేను ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు అలాగే నేను కోలుకోవాలని చేసిన ప్రార్థనలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.. అని వివరణ ఇచ్చారు.

ఐకాన్ కోసం వెయిటింగ్

ఐకాన్ కోసం వెయిటింగ్

ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదల కంటే ముందే మరొక సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అయితే ఐకాన్ చేయాల్సి ఉంది. కానీ సినిమా అసలు వస్తుందా రాదా అనేది ఇప్పటికి అనుమనంగానే ఉంది.

సిద్దమైన అల్లు అర్జున్

సిద్దమైన అల్లు అర్జున్

దిల్ రాజు అయితే సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక బన్నీ కూడా ఆ సినిమాను సెట్స్ పైకి తేవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులైతే ఎప్పుడో అయిపోయాయి. ఇక బన్నీ కోవిడ్ వలన మొన్నటివరకు క్వారంటైన్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు కొలుకోవడంతో వెంటనే తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వాలని ఆలోచనలో పడ్డట్లు సమాచారం. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ మూవీని డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X