Allu Arjun: కోట్ల రూపాయల ఆఫర్ రిజెక్ట్ చేసిన బన్నీ.. అతడి నిర్ణయంపై ప్రశంసలు

బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ మధ్య పెద్దగా సక్సెస్‌లను అందుకోలేకపోయినా.. 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక, గత ఏడాది చివర్లో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. అదే సమయంలో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పోటెత్తడంతో భారీ విజయం దక్కింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కొన్ని కోట్ల రూపాయల ఆఫర్ రిజెక్ట్ చేశాడట. ఆ పూర్తి వివరాలు మీకోసం!

పుష్పగా అల్లు అర్జున్ సందడి

పుష్పగా అల్లు అర్జున్ సందడి

సుదీర్ఘ కాలం తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

అన్ని భాషల్లోనూ భారీ సక్సెస్

అన్ని భాషల్లోనూ భారీ సక్సెస్

భారీ బడ్జెట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది.

రూల్ చేయడానికి సిద్ధంగానే

రూల్ చేయడానికి సిద్ధంగానే

'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రూపొందనుందన్న విషయం తెలిసిందే. మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

షూట్ స్టార్ట్ కాకున్నా ఆఫర్లతో

షూట్ స్టార్ట్ కాకున్నా ఆఫర్లతో

'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ అనకుంటోంది. త్వరలోనే దీన్ని పట్టాలెక్కిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు చాలా రోజులుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గ్యాప్‌లో వాటితో బన్నీ బిజీగా

గ్యాప్‌లో వాటితో బన్నీ బిజీగా

'పుష్ప' మొదటి భాగం పూర్తైన తర్వాత నుంచి అల్లు అర్జున్ ఖాళీగానే ఉంటున్నాడు. ఈ సమయాన్ని కూడా క్యాష్ చేసుకునేందుకు అతడు కొన్ని వ్యాపార ప్రకటనల్లో పాల్గొంటున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని యాడ్స్‌ను కంప్లీట్ చేసుకున్నాడు. బ్రాండ్ వ్యాల్యూ ఎక్కువగా ఉన్న హీరో కావడంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదగడంతో అతడికి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది.

భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన బన్నీ

భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన బన్నీ

సినిమాల పరంగా తన మార్కెట్‌ను దేశ వ్యాప్తంగా పెంచుకున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే తన బ్రాండ్ వ్యాల్యూను కూడా క్రమంగా విస్తృత పరుచుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఐకాన్ స్టార్‌కు ఓ టుబాకో కంపెనీ నుంచి భారీ యాడ్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. అయితే, అతడు దీన్ని వెంటనే రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఇప్పుడీ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

బన్నీ నిర్ణయంపై ప్రశంసలు

బన్నీ నిర్ణయంపై ప్రశంసలు

టుబాకో కంపెనీ యాడ్‌ కోసం అల్లు అర్జున్‌కు సదరు సంస్థ కొన్ని కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందట. అయితే, అలాంటి యాడ్స్ చేయకూడదని డిసైడ్ అయిన బన్నీ వెంటనే తిరస్కరించాడని అంటున్నారు. ఇక, ఐకాన్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి. విలువల కోసం కోట్ల రూపాయలను వదలుకోవడంపై అతడిని అభినందిస్తున్నారంతా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X