అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు.. మరికొద్ది రోజుల్లోనే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ ఇంతవరకు కొత్త చిత్రం ప్రారంభించలేదు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో బన్నీ చిత్రం ఉంటుందని భావించినా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు బలంగా వినిపిస్తోంది.
ఎట్టకేలకు బన్నీ తన నెక్స్ట్ మూవీ గురించి కొంత క్లారిటీ ఇచ్చాడు. నా తదుపరి చిత్ర ప్రకటన కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. మరికొద్ది రోజుల్లోనే నా నెక్స్ట్ మూవీ గురించి ప్రకటన చేస్తా అంటూ బన్నీ ట్విట్టర్ లో తెలిపాడు.

ఈ సందర్భంగా అభిమానులందరికి అల్లు అర్జున్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి అంతా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











