Pushpa 2: పుష్ప 2 లేడీ గెటప్ వెనుక ఇంత కథ ఉందా.. బన్నీ సుక్కుల కష్టాలు మాములుగా లేవుగా..
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మూవీ మేకర్స్. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప 2 మూవీ టీం నేడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప 2పై మరింత హైప్స్ పెంచేలా.. సినిమాలోని లేడీ గెటప్ క్రియేట్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు.
మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదలైన టీజర్స్, సాంగ్స్, పోస్టర్స్ తో భారీగా అంచనాలను పెంచేశాయి. ఇటీవల విడుదలైన ఐటమ్ సాంగ్ మూవీపై మరింత హైప్స్ పై క్రియేట్ చేసింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీ అయ్యారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాలలో ప్రమోషన్స్ నిర్వహించిన బన్నీ అండ్ పుష్ప టీం .. నేడు ముంబైలో గ్రాండ్ గా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప 2 మూవీ హైప్స్ పెంచేలా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ' పుష్ప 2 సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ కావడానికి లేడీ గెటప్ ( అమ్మవారి గెటప్) ఒక్కటి చూపిస్తే చాలని అన్నారు. ఆ మేకవర్ కోసం తాను ఎంతగానో కష్టపడ్డానని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన అల్లు అర్జున్ తాజాగా ఆ గెటప్ ఎలా క్రియేట్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు. సర్పైజ్ ఇవ్వాలని డైరెక్టర్ సుకుమార్ భావించారని తెలిపారు. ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు వచ్చాయనీ, తొలుత పుష్ప రాజ్ ను రిచ్ లూక్ లో చూపించాలని భావించారు.
ఆ లూక్ లో ఫోటో షూట్ కూడా పూర్తయింది. ఆ లుక్స్ రిలీజ్ అయిన మరు క్షణమే తనకు నచ్చలేదంటూ సుకుమార్ రిజెక్ట్ చేశాడు. తనకు ఇంకో ఏదో కావాలని ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇవ్వాలని ఆలోచించారు. అప్పుడు సరిగ్గా ఆ సమయంలో లేడీ గెటప్ గుర్తుకొచ్చింది. ఆ లేడీ గెటప్ ఐడియా మొత్తం సుకుమార్ దే అంటూ ఆ గెటప్ వెనుక ఓ కథను చెప్పారు. తనని లేడీ గెటప్ వెయ్యాలని సుకుమార్ చెప్పాడనీ, దాంతో తాను షాక్ అయ్యానని బన్నీ వెల్లడించారు. నేను ఏంటీ..? లేడీ గెటప్ వేయడమేంటీ? అని అన్నాను.
ఆ తరువాత సుకుమార్ పై నమ్మకం, ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వడం కోసం తాను ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని బన్ని తెలిపారు. అన్నారు. లేడీ గెటప్ కు ఓకే చెప్పాక... ఒకట్రెండు ఫొటో షూట్ లు జరిగాయి. మొదటి ఫోటోషూట్ ఫెయిల్ .. రెండో ఫోటో షూట్ కూడా ఫెయిల్. చివరికి ఫైనల్ అనుకున్నాం. మూడో ఫోటోషూట్ లో అనుకున్న గెటప్ సాధించామని సుకుమార్ అన్నార. తనకు ఏం కావాలో అప్పడు అర్థమైందని అల్లు అర్జున్ అన్నారు.
డైరెక్టర్ సుకుమార్ నిజంగా జీనియస్.. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతాడు. ఎంతైనా కష్టపడుతాడని ప్రసంశించారు బన్నీ. తన 20 ఏళ్ల సినీ కెరీర్లో అమ్మవారి గెటప్ కోసం పడిన కష్టం ఏ పాత్ర కోసం పడలేదనీ, తన కష్టాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదన్నారు. ఒక దశలో లేడీ గెటప్ వర్క్ అవుట్ అవుతుందా? కాదా? అనే సందేహం కూడా తనకు వచ్చిందని అన్నారు. లేడీ గెటప్ కోసం తాను దాదాపు రెండు గంటల పాటు మేకవర్ అయ్యే వాడినని, చాలా స్టార్ వెన్నునొప్పితో బాధపడ్డానని తెలిపారు అల్లు అర్జున్.


Click it and Unblock the Notifications











