Allu Arjun: ఆ వ్యక్తి నుంచి 'పుష్ప మ్యానేరిజం' కాపీ కొట్టిన అల్లు అర్జున్... బయటపడ్డ అసలు వీడియో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెన్సేషన్ అంతా ఇంతా కాదు... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యానేరిజం.. అందరినీ ఆకట్టుకుంది. ఆయన నడక దగ్గర నుంచి డైలాగుల వరకు అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఆ మ్యానేరిజాన్ని అల్లు అర్జున్ ఓ వ్యక్తి దగ్గర నుంచి కాపీ కొట్టాడని తెలుస్తోంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2021 డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 170 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన పుష్ప ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 373 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

Allu Arjun Reveals The Secret Behind Pushpa Mannerism Video Goes Viral

ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ యాక్టింగ్... హీరోయిన్ రష్మిక మందన్న, సమంత స్పెషల్ సాంగ్.. సుక్కు కథను తెరపై చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో అల్లు అర్జున్ మ్యానరిజం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప మ్యానేరిజాన్ని మన దేశంలోనే కాదు.. విదేశీయులు సైతం అనుసరిస్తూ.. వీడియోలు చేశారు.

Allu Arjun Reveals The Secret Behind Pushpa Mannerism Video Goes Viral

అయితే ఆ మ్యానరిజాన్ని అల్లు అర్జున్ ఎక్కడ నుంచి కాపీ కొట్టాడో తెలిపే వీడియో నెట్టింట ఒకటి వైరల్ గా మారింది. పుష్ప మూవీ రిలీజ్ అయిన టైంలో ఒక చేయి పైకెత్తి బన్నీ నడిచే తీరు... శ్రీవల్లి సాంగ్ లో ఆయన వేసిన హుక్ స్టెప్ యూత్ ను ఊపేశాయనే చెప్పాలి. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో ఇవీ బాగా వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా ప్రియులు పుష్ప మ్యానరిజాన్ని కాపీ కొడుతూ రీల్స్ చేశారు.

ప్రేక్షకులను ఇలాంటి మ్యాజిక్ లో ముంచేసిన పుష్ప మ్యానరిజాన్ని అల్లు అర్జున్ తన రియల్ లైఫ్ లో కలిసిన ఒక వ్యక్తి నుంచి కాపీ కొట్టారంట. కొన్నేళ్ల క్రితం ఓ మీటింగ్ కు హాజరైన అల్లు అర్జున్ అక్కడ యూత్ తో కలిసి స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకువచ్చాడు.
అంతేకాకుండా యాక్టింగ్ స్కిల్స్ కు సంబంధించిన క్లాసును తీసుకున్నారని తెలుస్తోంది. అలా స్టూడెంట్స్ ను ఇన్ స్ఫైర్ చేస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ కు ఒక వ్యక్తి డిఫరెంట్ మ్యానరిజంతో కనిపించారట.

Allu Arjun Reveals The Secret Behind Pushpa Mannerism Video Goes Viral

ఇక ఆ వ్యక్తి మ్యానేరిజాన్ని పుష్ప టైంలో కొత్తగా ఉంటుందని సినిమాలో ఉపయోగించారట. అలా నిజ జీవితంలో ఒక మనిషికి ఉన్న ఈ వింత మ్యానరిజాన్ని కాపీ కొట్టి.. పుష్ప సినిమాలో వాడుకుని ఫేమస్ అయిపోయాడు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ దశలో ఉంది. ఫస్ట్ పార్ట్ ను మించిపోయేలా రెండో పార్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X