KGF 2 పై అల్లు అర్జున్ రివ్యూ... మన సినిమాలు హైలో అంటూ అదిరిపోయే రియాక్షన్!
బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఒక కన్నడ సినిమా మొదటి సారి బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకొని నెంబర్ వన్ సినిమాగా గుర్తింపు అందుకుంటోంది. ఇక ఈ సినిమాను చూస్తున్న కొంతమంది సినీ ప్రముఖులు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కేజిఎఫ్ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ సంచలనం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చాప్టర్ 2 అంతకుమించి అనేలా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్ల కలెక్షన్స్ అందుకని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

RRR రికార్డ్ బ్రేక్
చాలా ఏరియాల్లో ఈ సినిమా RRR రికార్డులను కూడా బ్రేక్ చేయడం విశేషం. ముఖ్యంగా హిందీ లో అత్యధిక వేగంగా 250 కోట్లు కలెక్షన్స్ అందుకున్న సినిమా కూడా కేజిఎఫ్ చాప్టర్ 2 రికార్డు క్రియేట్ చేసింది. RRR సినిమా కంటే ఎక్కువ స్థాయిలో ఇండస్ట్రీలో రికార్డును క్రియేట్ చేయడం విశేషం.

అల్లు అర్జున్ రియాక్షన్
కేజిఎఫ్ చాప్టర్ 2 అద్భుతంగా ఉంది అంటూ సినీ ప్రముఖులు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మొత్తానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కేజిఎఫ్ చాప్టర్ 2 చూసి చిత్ర యూనిట్ సభ్యులందరిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమాకు పని చేసిన ముఖ్యమైన టెక్నీషియన్స్ పేర్లను ప్రస్తావిస్తూ వారి పనితనం గురించి తెలియజేశారు.

బన్ని ప్రశంసలు
KGF2 కి అభినందనలు. యష్ గారి పర్ఫెమెన్స్ అద్భుతంగా ఉందని అంటూ సంజయ్ దత్, రవీనా తండోన్ కూడా అద్భుతమైన నటనతో మెప్పించినట్లు అల్లు అర్జున్ తెలియజేశారు. అందరు నటీనటులు కూడా ఎంతగానో ఆకర్షించారని మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే భువన్ గౌడ అద్భుతమైన విజువల్స్ హైలెట్ గా ఉన్నట్లు తెలియజేశారు. ఇక సాంకేతిక నిపుణులందరికీ కూడా బన్నీ శుభాకాంక్షలు తెలియజేశారు.

అందరికీ ధన్యవాదాలు..
ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతమైన దర్శకత్వ ప్రదర్శన బాగా మెప్పించిందని ఆయన దృక్పథానికి, విశ్వాసానికి నా గౌరవం అని.. సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు అలాగే మన భారతీయ సినిమాలు హై లో పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.. అని అల్లు అర్జున్ తెలియజేశాడు.

కేజీఎఫ్ దర్శకుడితో సినిమా
ఇక అల్లు అర్జున్ కేజిఎఫ్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూనే అభిమానులతో పాటు మరికొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక దర్శకుడు ప్రశాంత్ తో కూడా బన్నీ ఒక సినిమా చేసేందుకు గతంలో చర్చలు జరిపినట్లు కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో తప్పకుండా వీరి కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











