Samajavaragamana: శ్రీవిష్ణు సినిమాకు రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. 100% అలాంటి సినిమా అంటూ..
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు బాక్సాఫీస్ వద్ద మరో మంచి సక్సెస్ అందుకున్నాడు. చిన్న బడ్జెట్ సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శ్రీ విష్ణు అంతకుముందు కొన్ని పెద్ద సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అతను హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మళ్లీ అదే తరహాలో కొన్ని పాత్రలు వచ్చినప్పటికీ ఎందుకో అటువైపుగా పెద్దగా ఫోకస్ చేయలేదు.

ఇక మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ.. లాంటి డిఫరెంట్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న శ్రీ విష్ణు ఆ మధ్య మళ్ళీ ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు మొత్తానికి సామజవరగమన అనే సినిమాతో శ్రీ విష్ణు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. పోటీగా నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమా ఉన్నప్పటికీ కూడా సామజవరకగమన సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి.

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాపై అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో పాజిటివ్ గా స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచి సినిమాలను చూసిన తర్వాత ఎప్పుడూ కూడా తనదైన శైలిలో స్పందించే అల్లు అర్జున్ ఈసారి శ్రీవిష్ణు సినిమాపై కూడా ప్రశంసల జల్లును కురిపించాడు. సామజవరగమన టీమ్ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు.

ఇది ప్రాపర్ గా ఒక తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఇలాంటి సినిమాను చాలా రోజుల తర్వాత చూశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొదటి నుంచి చివరి వరకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంతో చక్కగా రచించి దర్శకత్వం వహించాడు. ఇక శ్రీ విష్ణు మరోసారి అదరగొట్టేశాడు.
అతనిని చూస్తుంటే మరోసారి ఆనందంగా ఉంది. ఇక సీనియర్ నటుడు నరేష్ వెన్నెల కిషోర్ కూడా వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఇక మై మలయాళీ రెబ్బ మౌనిక కూడా అద్భుతంగా నటించింది. నిర్మాతలకు టెక్నీషియన్స్ అందరికీ కూడా గౌరవంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది 100% ఒక తెలుగు ఎంటర్టైన్మెంట్ అని అల్లు అర్జున్ తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











