twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్‌కు అక్కడ కూడా తిరుగులేని క్రేజ్.. హక్కుల కోసం భారీగా పోటీ!

    By Manoj Kumar P
    |

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఎంతో మంది యంగ్ హీరోలకు సవాల్ చేస్తూ టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నాడు. డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్‌లో సత్తా చాటే అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. తెలుగులోనే కాదు.. అతడికి కేరళలోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే బన్నీ ప్రతి సినిమానూ కేరళలో భారీ స్థాయిలో విడుదల చేస్తుంటారు. అలాగే మరో చోట కూడా బన్నీకి ఊహించని స్థాయిలో మద్దతు ఉంది. అతడి సినిమా వచ్చిందంటే ఎగబడి చూసేస్తుంటారు. కానీ, ఇప్పుడు మాత్రం ఊహించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎక్కడ ఇలా జరిగింది.? ఆ పరిస్థితికి కారణం ఏంటి..?

    ఆడియోను మించి వీడియో.. సామజవరగమన కోసం అక్కడి లొకేషన్లలో షూట్ఆడియోను మించి వీడియో.. సామజవరగమన కోసం అక్కడి లొకేషన్లలో షూట్

     బన్నీ సినిమా అక్కడ సెన్సేషన్

    బన్నీ సినిమా అక్కడ సెన్సేషన్

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. గతంలో బన్నీ నటించిన ఎన్నో సినిమాలు అక్కడ భారీ స్థాయిలో వ్యూస్ సాధించాయి. సినిమాల టీజర్లు, ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తన హిందీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతున్నాడు. దీంతో తెలుగులోనే ఎవరూ దక్కించుకోని రికార్డులను సొంతం చేసుకున్నాడు.

    ఆ రెండే ఇప్పటికీ టాప్

    ఆ రెండే ఇప్పటికీ టాప్

    అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు' హిందీ వాళ్లకు తెగ నచ్చేసింది. ఆ మూవీకి కూడా 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆరు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే, ‘డీజే' కూడా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ మూవీ ఇటీవలే 150 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. అంతేకాదు, ఐదు లక్షల పైచిలుకు లైకులు సొంతం చేసుకుంది. దీంతో వరుసగా రెండు సినిమాలకు యూట్యూబ్‌లో 150 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించిన హీరోగా బన్నీ రికార్డులకెక్కాడు. ఈ రెండు సినిమాలే ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.

    ఇదే నిదర్శనం

    ఇదే నిదర్శనం

    అల్లు అర్జున్ సినిమాలకు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అందుకే అతడి సినిమా హిందీ డబ్బింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. గతంలో కూడా కొన్ని సినిమాలు మంచి వ్యూస్ సాధించాయి. దీంతో నిర్మాతలు ఈ విధంగా కూడా క్యాష్ చేసుకుంటున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా భారీ వ్యూస్ సాధించాయి.

    ఇప్పుడా పరిస్థితి లేదు

    ఇప్పుడా పరిస్థితి లేదు

    త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ప్రస్తుతం నటిస్తున్న ‘అల.. వైకుంఠపురములో' సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 15 - 20 కోట్లు వరకు పలుకుతుందనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా పాటలకు విపరీతమైన క్రేజ్ వచ్చిన నేపథ్యంలో సినిమా డబ్బింగ్ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పలువురు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకొనేందుకు పోటీ పడుతున్నట్టు సమాచారం.

    ‘అల.. వైకుంఠపురములో' గురించి

    ‘అల.. వైకుంఠపురములో' గురించి

    ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న సినిమానే ‘అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

    English summary
    Ala Vaikunthapurramuloo is an upcoming Indian Telugu-language action drama film directed by Trivikram Srinivas and produced by Allu Aravind and S. Radha Krishna under their banners Geetha Arts and Haarika & Hassine Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X