బన్నీ ఖాతాలో అరుదైన ఘనత.. తెలుగులో మొట్ట మొదటి సినిమాగా రికార్డులకెక్కిన ‘అల’.!

By Manoj Kumar P

మెగా కాంపౌండ్‌కు చెందిన వాడే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటి కంటే ముఖ్యంగా స్టైల్స్‌తో యూత్‌తో ఫాలోయింగ్‌ను పెంచుకున్న అల్లు వారి అబ్బాయి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక, ఇటీవలే ఓ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని మాంచి జోష్ మీద ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఫలితంగా ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఆ సంగతులేంటో చూద్దాం.!

 ఇద్దరూ కలిశారు.. ఇండస్ట్రీ హిట్ కొట్టారు

ఇద్దరూ కలిశారు.. ఇండస్ట్రీ హిట్ కొట్టారు

‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కలయికలో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా వీళ్లిద్దరి ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది. అలాగే ఇండస్ట్రీ హిట్ కూడా వచ్చి చేరింది.

 సునామీ సృష్టించిన వైకుంఠపురములో

సునామీ సృష్టించిన వైకుంఠపురములో

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల.. వైకుంఠపురములో' ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 160 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో 3.5 మిలియన్ మార్కును అలవోకగా చేరుకుందీ సినిమా.

ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేసిన బన్నీ

ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేసిన బన్నీ

‘నా పేరు సూర్య' తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆ సమయంలో కొన్ని కథలను విన్నా దేనినీ ఓకే చేయలేదు. కానీ, త్రివిక్రమ్ తీసుకొచ్చిన ‘అల' కథ అతడికి బాగా నచ్చడంతో ఇది పట్టాలెక్కింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. మహేశ్ బాబు మూవీ నుంచి పోటీని తట్టుకొని నిలబడడంతో పాటు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గని స్పందన

ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గని స్పందన

‘అల.. వైకుంఠపురములో'కు విడుదలకు ముందే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఆ సినిమాలోని పాటలే. ఎస్ ఎస్ థమన్ అందించిన ఈ పాటలకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇవన్నీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక, ఈ మధ్య వీడియో సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. వాటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Recommended Video

Ala Vaikunthapurramloo Latest Controversy | It's Publicity Stunt Or Mistake ? | Filmibeat Telugu
అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత

ఇప్పటికే యాభై రోజులు పూర్తి చేసుకున్న ‘అల.. వైకుంఠపురములో' గత వారం ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మొదటి రోజే ఇండియాలోనే టాప్ టెన్ మూవీస్ లిస్టులో చోటు దక్కించుకున్న ఈ సినిమా.. రెండు రోజులకే ఆ జాబితాలో నెంబర్ వన్ ప్లేస్‌ను చేరుకుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ మైలురాయిని చేరుకోలేకపోవడం గమనార్హం.

సీక్రెట్ ప్లేస్‌కు అల్లు అర్జున్.. అందుకేనట

సీక్రెట్ ప్లేస్‌కు అల్లు అర్జున్.. అందుకేనట

‘అల.. వైకుంఠపురములో' ఇచ్చిన జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే అతడు సుకుమార్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇందులో బన్నీ ఫుల్ మాస్‌ లుక్‌తో కనిపించబోతున్నాడు. అందుకోసం గుబురు గెడ్డంతో పాటు పొడవైన జుట్టుతో దర్శనమివ్వనున్నాడు. అందుకోసం ప్రస్తుతం అతడు ఎవరికీ కనిపించకుండా ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X