టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్: ఈ ఘనత సాధించిన ఏకైక హీరో.. రెండో స్థానంలో ఆ స్టార్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అద్భుతమైన యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ ఆకట్టుకుంటూ స్టార్‌గా ఎదిగిపోయాడు. అలాగే, జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్నాడు. ఇక, గత ఏడాది ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ఇప్పుడు 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించాడు. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్‌గా

‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్‌గా

'ఆర్య', 'ఆర్య2' తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'పుష్ప'. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోందీ మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ సంగీతం అందిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అయ్యేందుకు కొత్తగా

ఐకాన్ స్టార్ అయ్యేందుకు కొత్తగా


స్టైలిష్ స్టార్‌గా పేరొందిన మెగా హీరో అల్లు అర్జున్.. 'పుష్ప' మూవీతో ఐకాన్ స్టార్‌గా మారిపోతున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో లారీ డ్రైవింగ్‌ నేర్చుకున్న అతడు.. రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. అన్నింటికీ మించి పాత్ర కోసం డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు.

రెండు భాగాలుగా ‘పుష్ప’ రిలీజ్

రెండు భాగాలుగా ‘పుష్ప’ రిలీజ్

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇది దేశ వ్యాప్తంగ చర్చనీయాంశం అయింది. ఇలాంటి సమయంలోనే తాజాగా నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. ఇక, ఇందులో మొదటి భాగం ఈ అక్టోబర్‌లో, రెండోది వచ్చే ఏడాది విడుదల కానున్నాయట.

రిలీజ్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్స్

రిలీజ్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్స్

అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుని 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఇప్పటికి దీనికి 64 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

తెలుగులో చరిత్ర సృష్టించిన బన్నీ

తెలుగులో చరిత్ర సృష్టించిన బన్నీ

విడుదలైనప్పటి నుంచే 'పుష్ప' టీజర్ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా 'Introducing Pushpa Raj' 1.5 మిలియన్ లైకులను అందుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మార్కును అందుకున్న ఏకైక టీజర్‌గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ హీరోగా చరిత్రను సృష్టించాడు.

Recommended Video

Allu Arjun Family Time, Pushpa రెండు భాగాలు It's Official అంటున్న నిర్మాత || Filmibeat Telugu
రెండో స్థానంలో ఆ స్టార్.. అందులో

రెండో స్థానంలో ఆ స్టార్.. అందులో

వ్యూస్ పరంగా 'పుష్ప' మూవీ మొదటి స్థానంలో ఉండగా.. నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 'అఖండ' 53 మిలియన్ పైచిలుకు వ్యూస్ సాధించి రెండో స్థానంలో ఉంది. అయితే, దీనికి లైకులు మాత్రం 4.69 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక, రామరాజు ఫర్ భీం టీజర్‌కు 51 మిలియన్ పైచిలుకు వ్యూస్.. 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. అంటే లైకుల పరంగా ఎన్టీఆర్‌ది రెండో స్థానం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X