అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత: గతంలో ఏ సినిమాకూ అందని రికార్డు ‘పుష్ప’ సొంతం
'ఆర్య', 'ఆర్య2' తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'పుష్ప'. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోందీ మూవీ. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతుంది. యూనివర్శల్ కాన్సెప్ట్ కావడం వల్లే దీన్ని పాన్ ఇండియా రేంజ్‌తో తీస్తున్నారు. ఈ సినిమా అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా 'పుష్పరాజ్ పరిచయ' వీడియో విడుదలైంది. తాజాగా ఇది ఓ అరుదైన రికార్డును అందుకుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీకి సంబంధించిన 'ప్రీల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' అనే వీడియో శనివారం విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఆ వెంటనే అంటే అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుని ఏప్రిల్ 7న రాత్రి 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది.

ఇక, తాజాగా 'పుష్ప' టీజర్ 30 మిలియన్ మార్కును చేరుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, దీనికి 9 లక్షలకు పైగా లైకులు వచ్చినట్లు కూడా తెలిపింది. దీంతో అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











