టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్: అందులో ఎవరికీ అందనంత దూరంలో
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను నిరూపించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను సైతం త్వరగానే అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. దీంతో టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా మారాడు. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

‘పుష్ప'గా రాబోతున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లేందుకు
గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'పుష్ప' మూవీ రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఘాటీ రోడ్‌లో లారీ డ్రైవింగ్ నేర్చుకోవడం.. డీ గ్లామర్‌గా కనిపించడం.. చిత్తూరు యాసలో మాట్లాడడంతో పాటు రియల్ స్టంట్స్ చేస్తున్నాడట.

రెండు భాగాలుగా.. షూటింగ్ అప్‌డేట్
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇప్పటికే మొదటి భాగానికి 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్ కోసం దాదాపు 40 శాతం చిత్రీకరణ జరిపారని సమాచారం.

రిలీజ్‌కు ముందే రికార్డులు కొడుతూ
'పుష్ఫ' నుంచి కొద్ది రోజుల క్రితమే టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి ఇటీవలే 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి', 'సామీ సామీ', 'ఇది నా అడ్డా' పాటలను వదలగా వీటికి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ సొంతమైంది.

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా బన్నీ
పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ నుంచి టీజర్‌ను హై లెవెల్ ఓల్టేజ్ సీన్స్‌తో వదిలారు. దీంతో దీనికి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది 80 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ టీజర్ బన్నీని నెంబర్ వన్ హీరోను చేసేసింది.

అందులో ఎవరికీ అందనంత దూరం
క్రేజీ కాంబోలో వస్తున్న 'పుష్ప' మూవీ టీజర్ తాజాగా యూట్యూబ్‌లో రెండు మిలియన్ లైకుల మార్కును చేరుకుంది. తద్వారా టాలీవుడ్‌లో మరే టీజర్‌కు దక్కని ఘనత సొంతం అయింది. దీంతో ఈ మార్కును చేరుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతానికి ఈ టీజర్‌కు 89.9 మిలియన్ వ్యూస్‌తో పాటు 2 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి.


Click it and Unblock the Notifications











